Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
పత్రికా ప్రకటన
రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ
రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు.
ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు.
నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.419 Views -
ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి
న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.335 Views -
-
-