మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుంచే ఉన్నత విలువలు కలిగిన జగ్జీవన్ రామ్, మూడు దశాబ్దాల పాటు...