Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "బండి-ఈటల విభేదాలకు ముగింపు".|
    - కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం - అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు - పార్టీ కోసమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 18: తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె....
    850 Views
  • ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    జూలై 18, 2026 మంచిర్యాల జిల్లా  :ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లా మంత్రి, రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున 20వ తేదీ సోమవారం రోజున జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు...
    334 Views
  • ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి సాత్విక్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
    రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన పట్ల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ గారు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, సాత్విక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ...
    326 Views
  • అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు

    హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

    నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

    శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం.

    మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం.

    కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి.

    19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు.

    తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు.

    24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది.

    మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు:
    ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

    దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410)
    • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390)
    1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062
    • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986
    • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.
    789 Views
  • తెలుగుదేశం పార్టీలో చేరిన 150 వైసీపీనుండి కార్యకర్తలు
    *అన్నమయ్య జిల్లా* *రాయచోటి నియోజకవర్గం* *లక్కిరెడ్డిపల్లె మండలం* *18-07-2026*   *మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం... దప్పేపల్లెలో 150 మంది టీడీపీ గూటికి*   *తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*   లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామానికి చెందిన *మాజీ ఎంపీటీసీ,మాజీ జడ్పీటీసీ అంబా బత్తిన...
    392 Views
  • కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్

    హైదరాబాద్ :
    ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

    కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు.

    కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.

    సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    495 Views
  • Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,
    భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ TGలోనూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు...
    280 Views
  • మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
    సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన ఫలితాల్లో ఇన్వాలిడేషన్ శాతం గణనీయంగా తగ్గి కేవలం 25 శాతానికే పరిమితం కావడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.మొత్తం 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవగా, 28 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 92 మందిలో 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించారు....
    342 Views