I am a graduate my hobbies listen songs and playing cricket
-
382 Posts
-
354 Photos
-
27 Videos
-
Reporter at Hyderabad
-
Lives in Rangareddy
-
From Mamidikuduru (East godavari)
-
Studied ACCOUNTS at Mrs AVN collegeClass of B.com
-
Followed by 8 people
-
Experience
5+ Years -
Language
Hindi , Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana -
Assembly Constituency
L B NAGAR -
District
K V RANGAREDDY -
Mandal | Tahasil | Sub Division
MEDCHAL - MALKAJGIRI
Recent Updates
-
Uppal bhagayat arya vyshiya building bhoomi poojaహైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/watch?v=g_Z_YnCVW-w *X* https://x.com/TelanganaCMO/status/2099029956139651178 *Facebook* https://www.facebook.com/100064704154682/videos/10815260275949920 Comments 0 Shares 67 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.
✅ శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
✅ ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
✅ గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
✅ గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు.
✅ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తెలిపారు.
✅ గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
✅ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు.
✅ ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
✅ నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. ✅ శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ✅ ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ✅ గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ✅ గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు. ✅ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తెలిపారు. ✅ గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ✅ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు. ✅ ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ✅ నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.0 Comments 0 Shares 103 Views 0 Reviews -
Tomorrow banks strikeదీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ ఛైర్మన్ అనిల్‌కుమార్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పి.మురళి,...0 Comments 0 Shares 116 Views 0 Reviews
-
శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్‌లో ముఖ్యమంత్రి గారిని దేవాదాయ శాఖ కమిషనర్ గారు, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు.
ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు.శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్‌లో ముఖ్యమంత్రి గారిని దేవాదాయ శాఖ కమిషనర్ గారు, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు.0 Comments 0 Shares 103 Views 0 Reviews -
International literacy dayఅంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్షరాస్యత ఒక ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను పరివర్తన చేసే శక్తివంతమైన సాధనం. 📚 అక్షరాస్యత ప్రతి ఒక్కరి హక్కు. అక్షరం ప్రతి ఇంటా వెలుగులు నింపాలి. ప్రతి బిడ్డకూ విద్య అందాలి. ఎవరూ చదువుకు దూరం కాకూడదు. ప్రతి బిడ్డనూ...0 Comments 0 Shares 125 Views 0 Reviews
-
హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు.
✳️ రూ. 620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, కె. రఘువీర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. ✳️ రూ. 620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, కె. రఘువీర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 177 Views 0 Reviews -
నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ..
వరంగల్: కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి కొండా సురేఖ వరంగల్ నియోజకవర్గంలోని తన అనుచరులతో నేడు సమావేశం కానున్నారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తన ఢిల్లీ పర్యటన, పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది.
ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, తన కుటుంబంపై జరుగుతున్న విమర్శలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సురేఖ ఇప్పటికే వెల్లడించారు. అధిష్ఠానానికి చెప్పాల్సిన అన్ని విషయాలను స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వరంగల్‌లో తనకు మద్దతుగా ఉన్న ముఖ్య నేతలు, కార్యకర్తలతో సురేఖ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపై అధిష్ఠానం వైఖరి ఏమిటి? వంటి అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది.
ఇటీవల కొండా సురేఖ, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆమె వివరణ ఇచ్చారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై, తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం సరికాదని సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు, వరంగల్ నియోజకవర్గంలో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై కూడా అనుచరులతో సురేఖ చర్చించే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ కోసం కలిసి పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, సురేఖతో భేటీకి నియోజకవర్గంలోని పలువురు ముఖ్య అనుచరులు, నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఆమె నుంచి మరిన్ని కీలక వ్యాఖ్యలు వెలువడే అవకాశం ఉంది.నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ.. వరంగల్: కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి కొండా సురేఖ వరంగల్ నియోజకవర్గంలోని తన అనుచరులతో నేడు సమావేశం కానున్నారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తన ఢిల్లీ పర్యటన, పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, తన కుటుంబంపై జరుగుతున్న విమర్శలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సురేఖ ఇప్పటికే వెల్లడించారు. అధిష్ఠానానికి చెప్పాల్సిన అన్ని విషయాలను స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో తనకు మద్దతుగా ఉన్న ముఖ్య నేతలు, కార్యకర్తలతో సురేఖ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపై అధిష్ఠానం వైఖరి ఏమిటి? వంటి అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది. ఇటీవల కొండా సురేఖ, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆమె వివరణ ఇచ్చారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై, తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం సరికాదని సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, వరంగల్ నియోజకవర్గంలో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై కూడా అనుచరులతో సురేఖ చర్చించే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ కోసం కలిసి పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సురేఖతో భేటీకి నియోజకవర్గంలోని పలువురు ముఖ్య అనుచరులు, నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఆమె నుంచి మరిన్ని కీలక వ్యాఖ్యలు వెలువడే అవకాశం ఉంది.1 Comments 0 Shares 550 Views 0 Reviews -
Amberpet flyover openingహైదరాబాద్ మూసీ నదిపై అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో కొత్తగా నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. 400 మీటర్ల పొడవైన ముసారాంబాగ్ బ్రిడ్జిని రూ. 52 కోట్లతో నిర్మించారు. ఈ...0 Comments 0 Shares 158 Views 0 Reviews
-
ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
*YouTube*
https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3
*X*
https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20
*Facebook*
https://www.facebook.com/share/v/1DLq3BQ3em/ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3 *X* https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20 *Facebook* https://www.facebook.com/share/v/1DLq3BQ3em/0 Comments 0 Shares 326 Views 0 Reviews -
హైదరాబాద్ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
*YouTube*
https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX
*X*
https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20
*Facebook*
https://www.facebook.com/share/v/189ppXnscU/హైదరాబాద్ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX *X* https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20 *Facebook* https://www.facebook.com/share/v/189ppXnscU/0 Comments 0 Shares 324 Views 0 Reviews -
[31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్
[31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తుది దశకు చేరుకున్నాయి. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. మూసీ నదిపై నిర్మించిన నూతన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
[31/08, 12:42 pm] Kumar: బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగే అవకాశం ఉంది. ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సుమారు రూ. 52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. పీక్ అవర్స్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తోన్నారు.
[31/08, 12:43 pm] Kumar: ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులతో కలిసి వంతెన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసింది.. జీహెచ్‌ఎంసీ. దీని మొత్తం పొడవు 400 మీటర్లు. వెడల్పు 14.5 మీటర్లు. ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. పాదాచారుల కోసం మూసారాంబాగ్ వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను నిర్మించారు.
[31/08, 12:43 pm] Kumar: వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన తరుణంలో పాత మూసారాంబాగ్ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోయేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‍సుఖ్ నగర్, గోల్నాక మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయేది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఫలితంగా వేలాది మంది వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించేవారు.
[31/08, 12:43 pm] Kumar: నూతన హైలెవెల్ వంతెన అందుబాటులోకి వస్తోండటంతో ఈ ఇబ్బందులు తప్పినట్టవుతుంది. భవిష్యత్తులో మూసీ నదికి ఎంతటి వరదలు వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నది ప్రవాహ స్థాయి కంటే చాలా ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం దీనికి ప్రధాన కారణం.[31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్ [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తుది దశకు చేరుకున్నాయి. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. మూసీ నదిపై నిర్మించిన నూతన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. [31/08, 12:42 pm] Kumar: బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగే అవకాశం ఉంది. ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సుమారు రూ. 52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. పీక్ అవర్స్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తోన్నారు. [31/08, 12:43 pm] Kumar: ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులతో కలిసి వంతెన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసింది.. జీహెచ్‌ఎంసీ. దీని మొత్తం పొడవు 400 మీటర్లు. వెడల్పు 14.5 మీటర్లు. ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. పాదాచారుల కోసం మూసారాంబాగ్ వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను నిర్మించారు. [31/08, 12:43 pm] Kumar: వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన తరుణంలో పాత మూసారాంబాగ్ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోయేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‍సుఖ్ నగర్, గోల్నాక మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయేది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఫలితంగా వేలాది మంది వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించేవారు. [31/08, 12:43 pm] Kumar: నూతన హైలెవెల్ వంతెన అందుబాటులోకి వస్తోండటంతో ఈ ఇబ్బందులు తప్పినట్టవుతుంది. భవిష్యత్తులో మూసీ నదికి ఎంతటి వరదలు వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నది ప్రవాహ స్థాయి కంటే చాలా ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం దీనికి ప్రధాన కారణం.0 Comments 0 Shares 233 Views 0 Reviews -
-
న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు
delhi-timber-factory-no-casualtiesన్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు delhi-timber-factory-no-casualties0 Comments 0 Shares 254 Views 0 Reviews -
‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
✴️ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో, ప్రతి క్రీడాకారుడు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.
✴️ క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.
✴️ అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలను కల్పిస్తున్నామని గుర్తుచేస్తూ, తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ✴️ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో, ప్రతి క్రీడాకారుడు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ✴️ క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ✴️ అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలను కల్పిస్తున్నామని గుర్తుచేస్తూ, తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.0 Comments 0 Shares 206 Views 0 Reviews -
శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి!
andhrapradesh/srisailam-water-updateశ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి! andhrapradesh/srisailam-water-update0 Comments 0 Shares 293 Views 0 Reviews -
చంద్రకు రూ. 22,000 కోట్ల నజరానా?
బహుశా భారత దేశ కార్పొరేట్ చరిత్రలో ఈ స్థాయి రుణమాఫీ జరగడం ఇదే మొదటిసారి ఏమో? పైగా ఓ వ్యక్తికి… కంపెనీకి కాదు. జీ గ్రూప్ అధినేత, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న సుభాష్ చంద్రకు సంబంధిచిన రూ. 22000 కోట్ల రుణాన్ని ఎన్‌సీఎల్‌టీ దాదాపు కొట్టేసింది. ఆయన ఇవ్వాల్సిన మొత్తం రూ. 22,006 కోట్లు కాగా, ఇందులో రూ. 6.5 కోట్లు చెల్లించాల్సిందిగా తాజాగా NCLT ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన NCLT జ్యుడిషియల్ మెంబర్ జడ్జి నిలేష్ శర్మ 144 పేజీల ఉత్తర్వులు జారీ చేశారు. రుణదాతులు అడిగినంత సొమ్ము సుభాష్ చంద్ర వద్ద లేదని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం విశేషం. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు జడ్జీల బెంచ్ భిన్న తీర్పు ఇచ్చింది. దీంతో శర్మను ఈ ధర్మాసనంలో మూడో సభ్యునిగా చేర్చారు. ఆయన చంద్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దాదాపు 99.97 శాతం హెయిర్ కట్ (రుణ మాఫీ)తో ఇచ్చిన ఈ తీర్పు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాపం ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన రుణం ఏకంగా రూ. 1322 కోట్లు కాగా, కేవలం రూ. 38 లక్షలతో సరిపెట్టుకొమ్మని NCLT ఆదేశించడం కార్పొరేట్ రంగం ఆశ్చర్య పోయేలా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ము ఇలా వేల కోట్లను ఎలా మాఫీ చేస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనిపై యూనైటెడ్ బ్యూవరీస్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారశ్రామిక వేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాను రూ. 6203 కోట్లు బాకీ ఉంటే… ఏకంగా రూ. 14,100 కోట్లను తన నుంచి వసూలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ మాల్యా విదేశాల్లో ఉంటే ఆయన కంపెనీ షేర్లను ఈడీ జప్తు చేసింది. ఆ తరవాత వీటిని డచ్ కంపెనీ హెంకిన్ ఎన్‌వీకి అమ్మేశారు. మాల్యాకు కంపెనీలో ఉన్న 15 శాతం వాటాను రూ. 5824 కోట్లకు అమ్మేశారు. ఇంకా ఇతర ఆస్తులను కూడా జప్తు చేసి అమ్మేశారు. తన ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 14,100 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వం అంగీకరించిందని విజయ్ మాల్యా ఇవాళ తన పోస్ట్ పెట్టారు. కాని ఏ మీడియా సంస్థ కూడా దీన్ని ప్రశ్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రకు రూ. 22,000 కోట్ల నజరానా? బహుశా భారత దేశ కార్పొరేట్ చరిత్రలో ఈ స్థాయి రుణమాఫీ జరగడం ఇదే మొదటిసారి ఏమో? పైగా ఓ వ్యక్తికి… కంపెనీకి కాదు. జీ గ్రూప్ అధినేత, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న సుభాష్ చంద్రకు సంబంధిచిన రూ. 22000 కోట్ల రుణాన్ని ఎన్‌సీఎల్‌టీ దాదాపు కొట్టేసింది. ఆయన ఇవ్వాల్సిన మొత్తం రూ. 22,006 కోట్లు కాగా, ఇందులో రూ. 6.5 కోట్లు చెల్లించాల్సిందిగా తాజాగా NCLT ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన NCLT జ్యుడిషియల్ మెంబర్ జడ్జి నిలేష్ శర్మ 144 పేజీల ఉత్తర్వులు జారీ చేశారు. రుణదాతులు అడిగినంత సొమ్ము సుభాష్ చంద్ర వద్ద లేదని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం విశేషం. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు జడ్జీల బెంచ్ భిన్న తీర్పు ఇచ్చింది. దీంతో శర్మను ఈ ధర్మాసనంలో మూడో సభ్యునిగా చేర్చారు. ఆయన చంద్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దాదాపు 99.97 శాతం హెయిర్ కట్ (రుణ మాఫీ)తో ఇచ్చిన ఈ తీర్పు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాపం ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన రుణం ఏకంగా రూ. 1322 కోట్లు కాగా, కేవలం రూ. 38 లక్షలతో సరిపెట్టుకొమ్మని NCLT ఆదేశించడం కార్పొరేట్ రంగం ఆశ్చర్య పోయేలా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ము ఇలా వేల కోట్లను ఎలా మాఫీ చేస్తారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనిపై యూనైటెడ్ బ్యూవరీస్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారశ్రామిక వేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాను రూ. 6203 కోట్లు బాకీ ఉంటే… ఏకంగా రూ. 14,100 కోట్లను తన నుంచి వసూలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ మాల్యా విదేశాల్లో ఉంటే ఆయన కంపెనీ షేర్లను ఈడీ జప్తు చేసింది. ఆ తరవాత వీటిని డచ్ కంపెనీ హెంకిన్ ఎన్‌వీకి అమ్మేశారు. మాల్యాకు కంపెనీలో ఉన్న 15 శాతం వాటాను రూ. 5824 కోట్లకు అమ్మేశారు. ఇంకా ఇతర ఆస్తులను కూడా జప్తు చేసి అమ్మేశారు. తన ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 14,100 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వం అంగీకరించిందని విజయ్ మాల్యా ఇవాళ తన పోస్ట్ పెట్టారు. కాని ఏ మీడియా సంస్థ కూడా దీన్ని ప్రశ్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.0 Comments 0 Shares 205 Views 0 Reviews -
అమెరికా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువకుడు పుట్టా రాహుల్ మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రాథమిక సమాచారం మేరకు రాహుల్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు యువకుల్లో ఒకరు మరణించగా, మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోందని, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించడమే కాకుండా తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
విదేశీ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అమెరికా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువకుడు పుట్టా రాహుల్ మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రాథమిక సమాచారం మేరకు రాహుల్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు యువకుల్లో ఒకరు మరణించగా, మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోందని, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించడమే కాకుండా తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. విదేశీ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.0 Comments 0 Shares 278 Views 0 Reviews -
కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
కోదాడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని సూచించారు.కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి కోదాడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని సూచించారు.0 Comments 0 Shares 180 Views 0 Reviews
More Stories