Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కూటమిలో కచ్చితంగా త్యాగాలు ఉంటాయి... నాదేండ్ల మనోహర్
    ఏపీ. కూటమి అన్నప్పుడు కచ్చితంగా త్యాగాలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయాల్లో చిన్న చిన్న గ్యాపులు సహజమని కూటమిలో సీట్ల పంపకాల ఇబ్బందులు తాత్కాలికమని చెప్పారు. ఏ పార్టీ అయినా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే చూస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే కూటమి పనిచేస్తుందని నాయకులు ఈగోలు  లేకుండా ముందుకెళ్లాలని కోరారు. 
    83 Views
  • 🙏 చండీయాగ హోమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

    నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని శ్రీ దుర్గా పరమేశ్వరి మాత మందిరంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చండీయాగ హోమం కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    87 Views
  • ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా దసరా వేడుకలు..

    తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు గారి ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం నాడు దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.

    వేద పండితుల సమక్షంలో KCR గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ ఆయుధపూజ నిర్వహించారు.. ఈ వాహన పూజా కార్యక్రమంలో కేటీఆర్, హిమాన్షు రావు పాల్గొన్నారు.

    కుటుంబ సభ్యులు ఇతర పార్టీ నేతలు పాల్గొనగా శమీవృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

    ఎర్రవెల్లిలో నిర్వహించిన దసరా వేడుకల్లో... కేసీఆర్ గారి ధర్మపత్ని శోభమ్మ గారు, కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు.. మాజీ హోం మంత్రి మహమ్మద్ మెహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    90 Views
  • ముగతి గ్రామంలో కట్టి కోలంట్లు వేయడం జరిగింది
    నందవరం మండలం ముగతి గ్రామం లో విజయదశమి దసరా సందర్భంగా కట్టి కోలంట్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలంట్ల గురువుగారు బోయపల్లేషు. పాల్గొన్న వ్యక్తులు బోయ బసవరాజు. నల్లన్న. గుండప్ప. హరికృష్ణ. నాయుడు. రఘు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
    155 Views
  • దసరా ఉత్సవాలు 2026...
    తెనాలి.శ్రీ అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకి యు,ఆది మధ్యంతర హితయు సకల, చరాచర నిగ్రహను గ్రహ సామర్ధ్య దురంధరయు, దుష్ట శిక్షణబద్ధ దీక్ష యు, శ్రీ అసలేధర శతా దివ్య స్వరూపిణీయు, శ్రీ మదకండ భూమండలం మండ మాయమానాంధ్ర వేశాంతర్గత తెనాలి పట్టణ నిధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి,శ్రీ రాజరాజేశ్వరి,శ్రీ విద్య వాసిని అమ్మవార్లకు నవరాత్రి బ్రహ్మోత్సవములు శ్రీ పరాభవ నామ సంవత్సర ఆస్వాయజా  శుద్ధ పాడ్యమి...
    88 Views
  • ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు.|
    ● శామీర్‌పేట్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు ● ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్ష అల్వాల్, అక్టోబర్ 20: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మంగళవారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి...
    132 Views
  • దివ్యమైన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.

    ​ఈ పండుగ ప్రజల జీవితాల్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలవాలని, పట్టణ ప్రజలందరూ సుఖసంతోషలతో ఆయురారోగ్యాలతో మరియు సిరిసంపదలతో వర్ధిల్లాలని విజయదశమి స్ఫూర్తితో మిర్యాలగూడ పట్టణం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్రజలందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ

    మీ
    *గుడిపాటి శిరీష నవీన్ కుమార్ గారు,*
    (మున్సిపల్ వైస్ చైర్‌ పర్సన్ మిర్యాలగూడ)
    68 Views
  • విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం!
    విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం! కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చేతుల మీదుగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం సుజాతనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధర్మ కాటా ప్రైవేట్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తి కొనుగోళ్లను...
    105 Views
  • ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి..
     ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి.. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు!  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చొరవతో ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో రహదారి నిర్మాణం,...
    120 Views
  • నందిగామ 21వ వార్డులో అచ్చి దివ్య విస్తృత ప్రచారం...!!
    🟡21వ వార్డు ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారమే, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు అచ్చి దివ్య... నందిగామ, అక్టోబర్ 21: నందిగామ మున్సిపాలిటీ 21వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అచ్చి దివ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ...
    88 Views