ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి
న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.