Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జింకా వెంకట చలపతి పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం లభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జింకా వెంకట చలపతికి...
Vijayawada: విజయవాడ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా..? వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా..? ప్రస్తుతం బెజవాడ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బుధవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో రాధా జనసేనలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Madanapalle: మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సహదేవ (మంగళవారం) రాత్రి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సహదేవ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడని, ఈ క్రమంలో ఆయన కుమారుడు సంతోష్ తీవ్రంగా కొట్టడంతో సహదేవ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కనకదుర్గమ్మ వారు 'శ్రీ మహాచండి దేవి' అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విశేష రూపంలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు.
మహాచండి దేవి దర్శనార్థం బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో...
యూట్యూబ్ వీడియోలను నమ్మి నిధి కోసం ఆశపడటం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ పాడుబడిన బంగారు గనిలో నిధి ఉందని నమ్మి, అందులోకి దిగి చిక్కుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. చివరికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి (52), కిష్టయ్య అనే ఇద్దరు స్నేహితులు...
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశమయ్యారు.
ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. చెన్నై నగరానికి కృష్ణా జలాలను అందించే...
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న బియ్యం ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. రైతు బజార్లలో తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా BPT బియ్యం కిలో రూ.49కి, KNM/RNR రకం బియ్యం కిలో రూ.50కి విక్రయించనున్నట్లు సమాచారం.
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 12న విజయవాడలోని భవానీపురం రైతు బజార్లో KNM రకం బియ్యం...
● సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్, అక్టోబర్ 14: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి భీంరావు నగర్, జానకి నగర్, ఆనందరావు నగర్ కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆయా కాలనీల్లో సీవరేజీ పైప్‌లైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
పనులను సాధ్యమైనంత త్వరగా...
● రూ.20 లక్షల విలువైన ద్విచక్ర వాహనాలు పట్టివేత
● 42 బైక్ చోరీ కేసుల ఛేదన
● డూప్లికేట్ తాళాలతో వాహనాల అపహరణ
● ఒక్కో బైక్‌ను రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయం
● ప్రధాన నిందితుడు సంపంగి రమేశ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు
అల్వాల్,అక్టోబర్14:బేగంపేటలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్...