Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "పండగ వేళ జమ్మి చెట్టు సాక్షిగా పూజ చేసి, నన్ను గెలిపించిన నా కుటుంబం లాంటి ఐదో డివిజన్ ప్రజలతో ఈ తొలి దసరాను జరుపుకోవడం నా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది. మీ అందరి ఆశీస్సులే నా బలం. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు!
    113 Views
  • నగరంలో జరుగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు ఈరోజు వివిధ దుర్గామాత మండపాలను సందర్శించారు.

    మేయర్ గారు మొదట వినాయక్ నగర్‌లోని ప్రశాంతి హోమ్స్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి, అక్కడ జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్కండేయ మందిరం వద్ద దుర్గామాత మండపాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.తదనంతరం గాజులపేటలోని రామ్ మందిర్ వద్ద ఏర్పాటైన దుర్గామాత మండపాన్ని కూడా సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సంబంధిత కమిటీలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మేయర్ గారు పాల్గొని, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు సాఫీగా, భక్తిశ్రద్ధలతో జరగాలని, అందరూ కలిసి పనిచేయాలని మేయర్ గారు సూచించారు.
    భక్తులందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

    ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    106 Views
  • దుర్గమ్మ సన్నిధిలో సినీ తారల సందడి... నందివెలుగు.
    తెనాలి. సమీపంలోని నందివెలుగు కనకదుర్గమ్మ ఆలయంలో పలువురు సినీ నటులు సందడి చేశారు. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆ తరువాత నటులంతా ఆలయ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు . 
    121 Views
  • 26వ వార్డులో ఇప్పిలి శంకర్ ప్రచార జోరు: అభివృద్ధి ప్రణాళికతో ఇంటింటికీ
    పలాస-కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 26వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇప్పిలి శంకర్ ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. "పదవి హోదా కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఒక మార్గం" అన్నది తన నినాదమని ఆయన చెబుతున్నారు. ఉదయం నుంచే వార్డులోని వీధుల్లో తిరుగుతూ పెద్దలను పలకరించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఎన్నికల...
    330 Views
  • కూటమిలో కచ్చితంగా త్యాగాలు ఉంటాయి... నాదేండ్ల మనోహర్
    ఏపీ. కూటమి అన్నప్పుడు కచ్చితంగా త్యాగాలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయాల్లో చిన్న చిన్న గ్యాపులు సహజమని కూటమిలో సీట్ల పంపకాల ఇబ్బందులు తాత్కాలికమని చెప్పారు. ఏ పార్టీ అయినా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే చూస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే కూటమి పనిచేస్తుందని నాయకులు ఈగోలు  లేకుండా ముందుకెళ్లాలని కోరారు. 
    124 Views
  • 🙏 చండీయాగ హోమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

    నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని శ్రీ దుర్గా పరమేశ్వరి మాత మందిరంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చండీయాగ హోమం కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    113 Views
  • ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా దసరా వేడుకలు..

    తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు గారి ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం నాడు దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.

    వేద పండితుల సమక్షంలో KCR గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ ఆయుధపూజ నిర్వహించారు.. ఈ వాహన పూజా కార్యక్రమంలో కేటీఆర్, హిమాన్షు రావు పాల్గొన్నారు.

    కుటుంబ సభ్యులు ఇతర పార్టీ నేతలు పాల్గొనగా శమీవృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

    ఎర్రవెల్లిలో నిర్వహించిన దసరా వేడుకల్లో... కేసీఆర్ గారి ధర్మపత్ని శోభమ్మ గారు, కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు.. మాజీ హోం మంత్రి మహమ్మద్ మెహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    114 Views
  • ముగతి గ్రామంలో కట్టి కోలంట్లు వేయడం జరిగింది
    నందవరం మండలం ముగతి గ్రామం లో విజయదశమి దసరా సందర్భంగా కట్టి కోలంట్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలంట్ల గురువుగారు బోయపల్లేషు. పాల్గొన్న వ్యక్తులు బోయ బసవరాజు. నల్లన్న. గుండప్ప. హరికృష్ణ. నాయుడు. రఘు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
    189 Views
  • దసరా ఉత్సవాలు 2026...
    తెనాలి.శ్రీ అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకి యు,ఆది మధ్యంతర హితయు సకల, చరాచర నిగ్రహను గ్రహ సామర్ధ్య దురంధరయు, దుష్ట శిక్షణబద్ధ దీక్ష యు, శ్రీ అసలేధర శతా దివ్య స్వరూపిణీయు, శ్రీ మదకండ భూమండలం మండ మాయమానాంధ్ర వేశాంతర్గత తెనాలి పట్టణ నిధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి,శ్రీ రాజరాజేశ్వరి,శ్రీ విద్య వాసిని అమ్మవార్లకు నవరాత్రి బ్రహ్మోత్సవములు శ్రీ పరాభవ నామ సంవత్సర ఆస్వాయజా  శుద్ధ పాడ్యమి...
    143 Views
  • ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు.|
    ● శామీర్‌పేట్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు ● ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్ష అల్వాల్, అక్టోబర్ 20: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మంగళవారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి...
    190 Views