Bharat Aawaz

విజయవాడకు తమిళ సీఎం.. బలమైన బంధమన్న నారా లోకేశ్.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
95
Views

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశమయ్యారు.

ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. చెన్నై నగరానికి కృష్ణా జలాలను అందించే తెలుగు గంగ ప్రాజెక్టుతో పాటు పలు కీలక అంతర్రాష్ట్ర అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం. ఈ పర్యటనపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు

తమిళనాడు సీఎం విజయ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో స్వాగతం పలకడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై ఇద్దరు నేతలకు ఉమ్మడి దార్శనికత ఉందని, చారిత్రక తెలుగు-తమిళ బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని తన పోస్ట్‌లో తెలిపారు.