Bharat Aawaz

Vijayawada: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
81
Views

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా..? వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా..? ప్రస్తుతం బెజవాడ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బుధవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో రాధా జనసేనలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.