కేంద్రంపై గళమెత్తిన కార్మికులు- అల్వాల్ లో భారీ నిరసన .|

0
232

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం అల్వాల్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్మికులు సమర శంఖం పూరించారు.

ఏఐటీయూసీ సహా పలు కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా అల్వాల్ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

 

అల్వాల్ మీసేవ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. వందలాదిమంది పారిశుద్ధ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మరియు ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.

 

 ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం మరణ శాసనమని మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని హైర్ అండ్ ఫైర్ పద్ధతి వల్ల కార్పోరేట్ సంస్థలకు లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

 

ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించరాదు.

 

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 2.6000 వేలు చెల్లించి వారిని క్రమబద్ధీకరించాలి... అని తెలిపారు.

 

 ఈ కార్యక్రమంలో.. మున్సిపల్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, కే. రవి చందర్, TNTUC సీనియర్ నాయకులు ఆర్. చంద్రశేఖర్, AITUC జిల్లా నాయకులు, జి. మహేందర్, డి ఎం శేఖర్. బిజే శ్రీను, బి, నరేందర్, ఏ. బాబు, ఎం. సాయి కుమార్, పి.మురళి, కౌసర్, తిరుపతి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

 

#SIDHUMAROJU 

ALWAL

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్.
  కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్ 17-06-2026 Wed...
By Pagadala Venkateswar 2026-06-17 04:17:09 0 101
Telangana
"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్...
By Sidhu Maroju 2026-05-11 09:34:35 0 494
Telangana
" (Dacoit: A Love Story/Ek Prem Katha ఉత్కంఠభరితమైన ఈ పాన్-ఇండియా హిందీ-తెలుగు యాక్షన్-థ్రిల్లర్ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది .
అడవిశేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ...
By Thokala Sivaji 2026-03-30 02:42:22 0 589
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Andhra Pradesh
నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.
నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై...
By Pagadala Venkateswar 2026-01-29 06:12:44 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com