25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి

0
17

25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం-

ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర చరిత్రలోనే మైలురాయి-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్-

 

విజయవాడ- 16 డిసెంబర్ 2025-

 

ఖరిఫ్ 2025–26 సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 16 డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,96,854 మంది రైతుల నుండి రూ.5,938.20 కోట్ల విలువ గల 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే చెప్పుకోదగ్గ మైలురాయిగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

 

ఇప్పటివరకు 3,79,538 మంది రైతులకు రూ.5,682.77 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలిన రూ.255.43 కోట్ల రూపాయలు తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్‌లో రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయని తెలిపారు.

 

రైతులకు మద్దతు ధర (MSP) అందించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

 

రైతులు తమ ధాన్యం విక్రయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం: 1967 ను సంప్రదించవచ్చని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు 24 గంటల లోపు మద్దతు ధర (MSP) పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 3,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధరకన్నా తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com