Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెనాలిలో వైసీపీకి షాక్.... జనసేనలోకి 50 మంది చేరిక...
    మునిసిపల్ ఎన్నికలవేళ తెనాలిలో వైసీపీ నుంచి జనసేనలోకి 50 మంది చేరారు. స్థానిక 15వ వార్డుకు చెందిన తెనాలి డివిజన్ తాపీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మడెంపూడి నాగరాజు తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. జనసేన నాయకుడు హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగాయీ.ఎన్నికల వేల జరిగిన ఈ  పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
    72 Views
  • Madanapalle: కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా, పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లె మున్సిపాలిటీలోని 42వ వార్డును జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని 42వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, వార్డు అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ 42వ వార్డులో కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. వార్డులో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థి విజయానికి కృషి చేసి, ఆ విజయాన్ని పార్టీ అధిష్ఠానానికి బహుమతిగా అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.
    44 Views
  • ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో అరాచకాలు, రౌడీయిజం చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, అదే సమయంలో బాధితులకు పూర్తి భరోసా లభించాలని ఆయన ఆకాంక్షించారు.

    మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో నేడు నిర్వహించిన 'పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర పోలీసులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "ఖాకీ అంటే బాధ్యత, పోలీసు అంటే భరోసా. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది పోలీసులే. ప్రజలు పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీసులు తమ కుటుంబ సంతోషాలను త్యాగం చేస్తున్నారు" అని అన్నారు.

    ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, వీఐపీల పర్యటనలు ప్రశాంతంగా ముగియడం వెనుక పోలీసుల నిరంతర శ్రమ అభినందనీయమని కొనియాడారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులతో పోరాడుతూ పది మంది పోలీసులు ప్రాణాలర్పించారని, వారి త్యాగాలకు గుర్తుగా ఏటా ఈ దినాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.
    47 Views
  • రొంపిచర్లలో ముత్యాలమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో దుర్గా దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి గా దర్శనమిచ్చారు. అర్చకులు కుంకుమ అర్చన మరియు షోడశోపచార పూజలు చేసారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందచేశారు. రేపు అమ్మవారి ఊరేగింపు, నిమ్మజనం జరుగుతున్నట్లు సభ్యులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అశోక్ కుమార్, వాసు, శ్రీనివాసులు, మౌనిష్, మురళి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
    44 Views
  • పోలీస్ అమరవీరులకు శంకర్ రాజు నివాళి.|
    ● ప్రజల రక్షణలో వీరుల ప్రాణత్యాగం చిరస్మరణీయం ● అమరుల కుటుంబాల త్యాగాలకూ గుర్తింపు అవసరం ● శాంతియుత సమాజ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యం కీలకం అల్వాల్, 21 అక్టోబర్:విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సాహసాలు, సేవలు దేశానికి గర్వకారణమని మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను...
    83 Views
  • దసరా ఉత్సవాలు -గురవయ్య కాలనీ రోడ్డు, రామలింగేశ్వరపేట, తెనాలి.
    తెనాలి. దసరా ఉత్సవాలు సందర్భంగా నవరాత్రులు అమ్మవార్లకు ధూప,దీప, నైవేద్యాలతో 11. 10. 26 నుంచి 20.10. 26 వరకు అమ్మవార్లకు అర్చనలు, పూజలు,హోమాలు,కుంకుమ పూజలు, మరియు సాంస్కృతి కార్యక్రమాలు, కోలాటాలు, భరతనాట్యాలు, లలిత సహస్రనామాలు,దేవుని పాటలతో ప్రజలు అమ్మవారిని కొలుచుకున్నారు.ఈ తొమ్మిది రోజులు అమ్మవారి  వద్ద ఉంచిన గాజులు, కుంకుమ భక్తులందరికీ పంచినారు.   4000 మందికి అన్న వితరణ...
    73 Views
  • 26వ వార్డులో జనసంద్రంగా వైఎస్సార్‌సీపీ ర్యాలీ
    పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 26వ వార్డు పార్టీ జెండాల రెపరెపలతో, నినాదాలతో సందడిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో స్థానికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్డు వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఇప్పిలి కామేశ్వరి నేతృత్వంలో కాలనీ వీధుల గుండా సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. ప్రధాన వీధుల్లో...
    323 Views
  • 26వ వార్డులో జనసంద్రంగా వైఎస్సార్‌సీపీ ర్యాలీ
    పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 26వ వార్డు పార్టీ జెండాల రెపరెపలతో, నినాదాలతో సందడిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో స్థానికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్డు వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఇప్పిలి కామేశ్వరి నేతృత్వంలో కాలనీ వీధుల గుండా సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. ప్రధాన వీధుల్లో...
    57 Views
  • Training Session


    Need Training Session to Post News, Articles, Videos, Live and News Clips to Understand News Postings and Live Sessions ?

    7 Votes Select an option
    Love
    2
    750 Views