Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పోలీస్ అమరవీరులకు శంకర్ రాజు నివాళి.|
    ● ప్రజల రక్షణలో వీరుల ప్రాణత్యాగం చిరస్మరణీయం ● అమరుల కుటుంబాల త్యాగాలకూ గుర్తింపు అవసరం ● శాంతియుత సమాజ నిర్మాణంలో పౌరుల భాగస్వామ్యం కీలకం అల్వాల్, 21 అక్టోబర్:విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సాహసాలు, సేవలు దేశానికి గర్వకారణమని మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను...
    100 Views
  • Madanapalle: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు సతీమణి రాటకొండ రెడ్డమ్మ పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ను గమనించి, అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించాలని రాటకొండ శ్రీనివాసులు నాయుడు కోరారు.
    Like
    1
    49 Views
  • మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. ఎస్‌.ఎన్‌.హెచ్‌. అఫ్సర్ షరీఫ్‌ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు గాజుల భాస్కర్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం ప్రచార పాంప్లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డా. అఫ్సర్ షరీఫ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ, వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినా మదనపల్లెలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. తనను చైర్మన్‌గా గెలిపిస్తే మదనపల్లె అభివృద్ధికి కృషి చేసి చూపిస్తానని తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
    Like
    1
    48 Views
  • ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీలతో సమన్వయంపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే రెబెల్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

    సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని, అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదం పొందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని గుర్తుచేశారు. 'చెప్పాం.. చేస్తున్నాం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు.

    కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలతో పూర్తి సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా, సామరస్యపూర్వకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిత్రధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, జనసేన, బీజేపీలకు కేటాయించిన స్థానాల్లో కూడా రెబెల్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కిచెప్పారు.

    టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ద్వారా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబెల్స్‌గా నామినేషన్లు వేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారు వెంటనే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ప్రజలకు సేవ చేసే మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
    Like
    1
    46 Views


  • బెంగళూరు నుంచే జగన్ డైరెక్షన్.. రాష్ట్రంలో గొడవలకు వైసీపీ కుట్ర: ఎస్వీఎస్ఎన్ వర్మ.

    కూటమి ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేద‌న్న టీడీపీ నేత‌
    శాంతియుతంగా స్థానిక ఎన్నికలు.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వెల్ల‌డి
    పోలీసు అధికారిపై రోజా దాడి చేయడం దారుణమన్న ఎస్వీఎస్ఎన్ వర్మ
    బీసీ రిజర్వేషన్లను సైతం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపణ
    మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచే రాష్ట్రంలో గొడవలకు సూచనలు ఇస్తున్నారని, ఆయన ఆదేశాలతోనే కింది స్థాయి నాయకులు అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

    నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అత్యంత శాంతియుతంగా, పారదర్శకంగా జరుగుతున్నా.. శాంతిభద్రతలు లోపించాయనే తప్పుడు ప్రచారానికి వైసీపీ తెరలేపిందని విమర్శించారు.

    రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వర్మ అన్నారు. "గతంలో తమ పాలనలో నామినేషన్లు వేయకుండా బెదిరించడం, ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టి తప్పుడు కేసులు బనాయించడం వంటివి చేసిన చరిత్ర వైసీపీది. కానీ, మా ప్రభుత్వంలో అలాంటి బెదిరింపులకు తావులేదు.

    ప్రజాస్వామ్య విలువలపై టీడీపీకి ఉన్న నమ్మకానికి మాచర్ల నియోజకవర్గమే నిదర్శనం. గతంలో అదే మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడులు జరిగాయి. కానీ, నేడు అదే ప్రాంతంలో వైసీపీ నేతలు ఎలాంటి ఇబ్బంది లేకుండా 36 నామినేషన్లు శాంతియుతంగా వేశారు. ఇదే మా సంస్కృతి" అని వర్మ వివరించారు.
    45 Views
  • పెద్దపల్లి జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
    జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ...
    67 Views
  • దుర్గామాత నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – మేయర్ మహంకాళి స్వామి
    రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు, దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రశాంతి నగర్ చెరువు, సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద కొలను, గోలివాడ గోదావరి నదిలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.  
    Like
    1
    118 Views
  • అమరవీరుల త్యాగాలకు నివాళి.. రక్తదానంతో ప్రాణాలకు భరోసా.|
    ● రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలనే సందేశం  ● అమరవీరుల స్ఫూర్తితో మానవత్వం, సామాజిక బాధ్యతకు పెద్దపీట అల్వాల్, అక్టోబర్ 21:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి CAR హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.  విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు నివాళిగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి...
    Like
    1
    119 Views
  • అమరవీరుల సంస్కరణ దినోత్సవం.... తెనాలి
    తెనాలి లో బుధవారం పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జనార్ధన రావు పాల్గొని అమరులైన పోలీసు వీరులకు నివాళులర్పించారు. వీరితో పాటు 3 టౌన్ సీఐ శ్రీనివాసరావు, 1టౌన్ సీఐ రాంబాబు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని అధికారులు కొనియాడారు. పోలీసుల త్యాగాలు సమాజానికి ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు.
    77 Views