ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో అరాచకాలు, రౌడీయిజం చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, అదే సమయంలో బాధితులకు పూర్తి భరోసా లభించాలని ఆయన ఆకాంక్షించారు.
మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో నేడు నిర్వహించిన 'పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర పోలీసులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "ఖాకీ అంటే బాధ్యత, పోలీసు అంటే భరోసా. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ప్రజలకు మొదటగా గుర్తొచ్చేది పోలీసులే. ప్రజలు పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీసులు తమ కుటుంబ సంతోషాలను త్యాగం చేస్తున్నారు" అని అన్నారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, వీఐపీల పర్యటనలు ప్రశాంతంగా ముగియడం వెనుక పోలీసుల నిరంతర శ్రమ అభినందనీయమని కొనియాడారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులతో పోరాడుతూ పది మంది పోలీసులు ప్రాణాలర్పించారని, వారి త్యాగాలకు గుర్తుగా ఏటా ఈ దినాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.

46 Views