Bharat Aawaz
Padarti Venkat

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member

@venkat Media Group
Recent Updates
  • ఏపీ మునిసిపల్ ఎన్నికల తేదీ మార్పు
    ఏపీలోని అన్ని మున్సిపల్ స్థానాలకు పోలింగ్ రీ షెడ్యూల్ అయింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 28న పోలింగ్ జరగాల్సి ఉంది.దాన్ని నవంబర్ 1కి మారుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుoదీ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఇక్కడ ఈ నెల 23,24 తేదీలలో కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 25న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
    8 Views
  • దసరా ఉత్సవాలు -గురవయ్య కాలనీ రోడ్డు, రామలింగేశ్వరపేట, తెనాలి.
    తెనాలి. దసరా ఉత్సవాలు సందర్భంగా నవరాత్రులు అమ్మవార్లకు ధూప,దీప, నైవేద్యాలతో 11. 10. 26 నుంచి 20.10. 26 వరకు అమ్మవార్లకు అర్చనలు, పూజలు,హోమాలు,కుంకుమ పూజలు, మరియు సాంస్కృతి కార్యక్రమాలు, కోలాటాలు, భరతనాట్యాలు, లలిత సహస్రనామాలు,దేవుని పాటలతో ప్రజలు అమ్మవారిని కొలుచుకున్నారు.ఈ తొమ్మిది రోజులు అమ్మవారి  వద్ద ఉంచిన గాజులు, కుంకుమ భక్తులందరికీ పంచినారు.   4000 మందికి అన్న వితరణ...
    54 Views
  • తెనాలిలో వైసీపీకి షాక్.... జనసేనలోకి 50 మంది చేరిక...
    మునిసిపల్ ఎన్నికలవేళ తెనాలిలో వైసీపీ నుంచి జనసేనలోకి 50 మంది చేరారు. స్థానిక 15వ వార్డుకు చెందిన తెనాలి డివిజన్ తాపీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మడెంపూడి నాగరాజు తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. జనసేన నాయకుడు హరిదాస్ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగాయీ.ఎన్నికల వేల జరిగిన ఈ  పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
    56 Views
  • అమరవీరుల సంస్కరణ దినోత్సవం.... తెనాలి
    తెనాలి లో బుధవారం పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జనార్ధన రావు పాల్గొని అమరులైన పోలీసు వీరులకు నివాళులర్పించారు. వీరితో పాటు 3 టౌన్ సీఐ శ్రీనివాసరావు, 1టౌన్ సీఐ రాంబాబు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని అధికారులు కొనియాడారు. పోలీసుల త్యాగాలు సమాజానికి ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు.
    59 Views
  • దసరా ఉత్సవాలు 2026...
    తెనాలి.శ్రీ అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకి యు,ఆది మధ్యంతర హితయు సకల, చరాచర నిగ్రహను గ్రహ సామర్ధ్య దురంధరయు, దుష్ట శిక్షణబద్ధ దీక్ష యు, శ్రీ అసలేధర శతా దివ్య స్వరూపిణీయు, శ్రీ మదకండ భూమండలం మండ మాయమానాంధ్ర వేశాంతర్గత తెనాలి పట్టణ నిధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి,శ్రీ రాజరాజేశ్వరి,శ్రీ విద్య వాసిని అమ్మవార్లకు నవరాత్రి బ్రహ్మోత్సవములు శ్రీ పరాభవ నామ సంవత్సర ఆస్వాయజా  శుద్ధ పాడ్యమి...
    72 Views
  • కూటమిలో కచ్చితంగా త్యాగాలు ఉంటాయి... నాదేండ్ల మనోహర్
    ఏపీ. కూటమి అన్నప్పుడు కచ్చితంగా త్యాగాలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయాల్లో చిన్న చిన్న గ్యాపులు సహజమని కూటమిలో సీట్ల పంపకాల ఇబ్బందులు తాత్కాలికమని చెప్పారు. ఏ పార్టీ అయినా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే చూస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే కూటమి పనిచేస్తుందని నాయకులు ఈగోలు  లేకుండా ముందుకెళ్లాలని కోరారు. 
    66 Views
  • దుర్గమ్మ సన్నిధిలో సినీ తారల సందడి... నందివెలుగు.
    తెనాలి. సమీపంలోని నందివెలుగు కనకదుర్గమ్మ ఆలయంలో పలువురు సినీ నటులు సందడి చేశారు. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆ తరువాత నటులంతా ఆలయ అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు . 
    63 Views
  • తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ మార్పు...
    తెనాలి మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జేన్జే కళాశాల నుంచి బిఎస్సార్ అండ్ ఎన్ వి ఆర్ కళాశాలకు మార్పు చేశారు జెన్జీ కళాశాలను జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ పరిశీలించి ఇరుకుగా ఉన్నందున మార్పు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈనెల 30వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతాయని  మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. 
    63 Views
  • తెనాలిలో సీట్ల సర్దుబాటు ఖరారు. మునిసిపల్ ఎన్నికలు....
    తెనాలిలో మునిసిపల్ ఎన్నికల టిడిపి అభ్యర్థుల జాబితా విడుదలైంది.మొత్తం 52 వార్డులకు గాను కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది.జనసేనకు 20,బీజేపీకి 1, మిగిలిన 31 వార్డుల్లో టిడిపి పోటీ చేస్తుంది. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించారు.30, 48 వార్డుల అభ్యర్థుల పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.
    115 Views
  • తెనాలిలో నేడు(2వ రోజు)నామినేషన్ల జోరు
    తెనాలి. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నామినేషన్ కోలాహాలు నెలకొననుంది. ఈ రెండు రోజుల్లో వైసీపీకి చెందిన అభ్యర్థులు 25 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా 27 మంది కౌన్సిలర్లు,ఒక చైర్మన్ అభ్యర్థి నామినేషన్లు వేయాల్సి ఉన్నది. కూటమి తరఫున 52 మంది కౌన్సిలర్స్ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
    92 Views
  • తెనాలిలో కూటమి చైర్మన్ అభ్యర్థిగా తోటకూర రమణారావు
    తెనాలి.మున్సిపాలిటీ ఎన్నికల కూటమి సీట్ల పంపకంలో జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో కూటమి తరపున జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త,కాపు నేత,కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ర్ తోటకూర వెంకట రమణారావు ఖరారయ్యారు. ఈ ప్రకటనతో తెనాలి రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరిగింది.పోటీ ఆసక్తికరంగా మారనుంది.
    110 Views
  • తెనాలి పి ఓ,ఏపీఓ ల సిక్షనను పరిశీలించి న కమిషనర్....
    తెనాలి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పిఓ, ఏపీఓల శిక్షణను కమిషనర్ రామ అప్పలనాయుడు పరిశీలించారు.ఎన్నికలకు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ, సామాగ్రి వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పొరపాట్లకు తావు లేకుండా సిబ్బంది సమన్వయంతో,బాధ్యతగా పనిచేసీ ఎన్నికలను సజావుగా విజయవంతం చేయాలని అధికారులను సూచించారు.
    106 Views
  • తెనాలి. బిజిగా ఉన్నా...... విచారణకు రాలేను. అన్నాబత్తుని...
    తెనాలి. స్థానిక సంస్థల ఎన్నికల పనుల కారణంగా పోలీసుల విచారణకు హాజరు కాలేనని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా తెనాలి వన్టౌన్ సీఐ కి సమాచారం అందించారు. వైసిపి ఇన్చార్జిగా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈనెల 23న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.అన్నాబత్తుని 14న తొలి విచారణకు వెళ్లారు.
    102 Views
  • తెనాలి ఎన్నికల్లో ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో మంత్రి మనోహర్ ముఖాముఖి
    తెనాలి.జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఆసక్తి,స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
    109 Views
  • 2026 ఎన్నికల సన్నాహాలపై ఆర్బో సమీక్ష
    తెనాలి.జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలను ఆర్వో డి.దుర్గాబాయి సమీక్షించారు. స్థానిక ఎన్విఆర్ కళాశాలలో పంపిణీ కౌంటింగ్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూములను ఆమె పరిశీలించారు. తెనాలి మండలంలోని 21 స్థానాలకు 79 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల పిఓ,ఓపిఓ లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. 21 నుండి 23 వరకు నామినేషన్లు, 27న ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ ఐదున కౌంటింగ్ జరగనుంది అన్నారు.
    127 Views
  • దసరా ఉత్సవాలు ఆరవ రోజు అమ్మవారి 95వ శరన్నవ రాత్రోత్సవములు ములు
    దేవి చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడిలో 95వ శరన్నవ రాత్రోత్సవముల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అలంకారం చేయుచున్నారు అమ్మవారి అలంకారాల ఉభయ దాతలకు వారి గోత్రనామాలతో సాయంకాల సమయంలో అష్టోత్తర పూజలు జరిగినా మరియు ప్రసాదాలతో కలిపి ప్రసాదాలు భక్తులకు ఇస్తున్నారు ఉభయ దాతలు స్వయంగా వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈరోజు మూలా నక్షత్రం కావటం వలన శ్రీ మహా సరస్వతి దేవి అలంకారం...
    132 Views
  • ఏపీలో ఏ కార్పొరేషన్ ఏ పార్టీకి ఎన్ని కేటాయించారు?
    కార్పొరేషన్లు... బిజెపి 2, మున్సిపాలిటీలు 7, కార్పొరేషన్లు జనసేన 4, మున్సిపాలిటీలు 21,  కార్పొరేషన్లు టిడిపి11,మున్సిపాలిటీలు 78. కార్పొరేషన్లు బిజెపి- రాజమహేంద్రవరం, అనంతపురం,జనసేన -శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ. టిడిపి -విజయనగరం, విశాఖపట్నం,మచిలీపట్నం,మంగళగిరి, తాడేపల్లి,గుంటూరు,ఒంగోలు, నెల్లూరు,కడప, కర్నూలు,తిరుపతి,చిత్తూరు. నగర పంచాయతీలు -బిజెపికి నెల్లిమర్ల, ఎలమంచిలి, బాపట్ల,...
    Like
    1
    136 Views
  • తెనాలి మండల పంచాయితీ రిజర్వేషన్లు ఖరారు
    అంగళ కుదురుBC, బుర్రిపాలెం SC(W),  చావరి వారి పాలెంSC, ఎరుకులపూడిBC(W), గుడివాడ SC,ఆఫ్ పేటUR(W), జగడి గుంట పాలెంUR(W), కంచర్లపాలెంSC, కటేవరంUR(W), కొలకలూరుBC, కొప్పల్లేST, మల్లెపాడుUR, నందివెలుగుUR(W), నేలపాడుSC(W), పెదరావూరుUR, సంగం జాగర్లమూడి UR(W),సోమ సుందర పాలెంUR, తేలప్రోలుUR(W) గా రిజర్వేషన్లు ఖరారాయ్యాయి.
    Like
    1
    125 Views
More Stories