Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Pileru: పీలేరు-పులిచర్ల మార్గంలో రెడ్డివారిపల్లి వద్ద పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. రూ. 26 లక్షల ఎర్రచందనం స్వాధీనం, ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్.
    Pileru: పీలేరు- పులిచర్ల మార్గమద్యంలో రెడ్డి వారి పల్లి వద్ద 26 లక్షలు విలువ చేసే ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు ఎర్రచందన స్మగ్లర్లను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్న పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.
    273 Views
  • "జగన్నాథ రథయాత్ర" లో మర్రి దంపతుల సేవాభావం.|
    "ప్రత్యేక పూజలతో పాటు ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే దంపతులు" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన సతీమణి మమతా రెడ్డి తో కలిసి అల్వాల్‌లోని సుమారు 400 ఏళ్ల చారిత్రక శ్రీ జగదీప్ మందిర్‌లో నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...
    235 Views
  • సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టాకు నీరు విడుదల: చింతూరు
    పోలవరం జిల్లా తూర్పు డివిజన్ చింతూరు పరిధిలోని సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టా మూడు కాలువలకు నీరుని విడుదల చేశారు. డొంకరాయి జలాశయం నుంచి 3000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నట్టు ఏపీ జెన్కో అధికారులు స్పష్టం చేశారు. 16 నుండి 25 వరకు డొంకరాయి ప్రధాన ఆనకట్ట 6,7 గేట్ల నుండి నీటిని ధవలేశ్వరం అధికారుల మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఏ,పి జెన్కో...
    255 Views
  • విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం
    విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం` 1 నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ 67,47,190 మంది విద్యార్థులకు ల‌బ్ధి 24వ తేదీలోగా 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ. 10,120 కోట్లు జ‌మ  గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్ వాడీలకు కూడా తల్లికి వందనం వర్తింపు అడ్మిష‌న్లు, వెర్ఫికేష‌న్ పూర్తికాని వారికి ఆగ‌ష్టులో నిధుల విడుద‌ల త‌ల్లికి వంద‌నం అర్హుల వివ‌రాలు...
    213 Views
  • ఈ రోజు ఉదయం 9 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ‎ "చలో కొండ పోచమ్మ సాగర్"
    కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేయకుండా మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను ఎండబెడుతూ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ‎కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ‎ రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కి వ్యతిరేకంగా ‎ 17-07-3026 ఉదయం 9:00am గంటలకు చలో కొండపోచమ్మ సాగర్ (పాములపర్తి) ప్రోగ్రాం బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో...
    312 Views
  • పుంగనూరు:పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు
    పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాంబాబు పదోన్నతి పై పుంగనూరు కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రెజరీ సేవలు సత్వరమే అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఎస్టిఓ గా పదోన్నతి పొందిన రాంబాబును అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ డి టి ఎ ఓ లోకేష్ బాబు, ఎస్ టిఓ లు నరేష్ కుమార్ నాయక్ , పద్మనాభం సీనియర్ అకౌంటెంట్...
    438 Views
  • అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్‌ ఉల్లంఘన..
    భారత్ అవాజ్ / హుజూర్‌నగర్ రూరల్‌ :
    ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్‌ పద్ధతులను అధికార యంత్రాంగం విధిగా పాటించవలసి ఉంటుంది. ప్రభుత్వం తరఫున మంత్రుల పర్యటన, ఇతర అధికారుల పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులకు వేదికలపై స్థానాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
    హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరుగుతున్న మంత్రుల పర్యటన, అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు సరైన రీతిలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని అనేకమంది ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి చెప్పలేక లోలోన మదనపడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
    మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్‌ ఉల్లంఘన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారికి సరైన రీతిలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    నామినేటెడ్‌ పదవిలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్‌ ప్రకారం ముందు వరుసలో సంబంధిత వ్యక్తులకు స్థానాలు కేటాయించవలసి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా సరైన పద్ధతిలో స్థానాలు కేటాయించవలసి ఉంటుంది.
    కానీ అధికారిక పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
    ఎలాంటి హోదా లేని వారు సమావేశాల్లో ముందు వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అనేకమంది కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రోటోకాల్‌ ప్రకారం వేదికలపై స్థానాలు కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
    సమావేశాల్లో మాజీలదే హవా...
    అనేక సమావేశాల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కంటే మాజీ ప్రజాప్రతినిధుల హవా ఎక్కువ సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముందు ప్రోటోకాల్‌ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు.
    410 Views
  • *అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!*

    *కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.*

    *మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.*

    *జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.*

    *ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.*

    *వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.*

    *: వైద్యారోగ్య శాఖ*
    671 Views
  • Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.
    Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న భరోసా' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని...
    181 Views
  • చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
          చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు రాజకీయ ప్రత్యర్థుల కేసులపై కోర్టు ఆగ్రహం పాలసీ నిర్ణయాలకు నేరం ఆపాదించడం తప్పని వ్యాఖ్య ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆక్షేపణ ఫైనల్ తీర్పులో లార్డ్ డెన్నింగ్ సూత్రాలు రాష్ట్రంలో పాలకులు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు పెట్టే రాజకీయ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి బ్రేక్...
    194 Views