Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
    బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సేవాకైంకర్యాలు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది....
    247 Views
  • మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చచేయాలి: VZM కలెక్టర్
    మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.బుధవారం విజయనగరం కలెక్టరేట్ నుంచి జేసీ ఎస్.సేధు మాధవన్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సర్వేపై చర్చిస్తూ, ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవిధంగా సేవలను అందించాలని ఆదేశించారు. 22-ఏ అప్లికేషన్ల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, తదితర అంశాలపై సూచనలు చేశారు....
    281 Views
  • విశాఖ To భోగాపురం.. ఈ-బస్సులు రెడీ!
    భోగాపురం ఎయిర్పోర్ట్కు APSRTC నడపనున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 3 బస్సులు బుధవారం విశాఖ స్టీల్ డిపోకు చేరాయి. త్వరలో 20 బస్సులు రానున్నాయని రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు.ప్రారంభోత్సవం అనంతరం గాజువాక నుంచి రెండు మార్గాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈ బస్సులు నడుపుతారు. NAD, గురుద్వారా, వెంకోజిపాలెం, వుడా పార్క్ వద్ద లాంజ్లు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్, అక్టోబర్లో మరో 80 బస్సులు రానున్నాయి....
    262 Views
  • హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు: ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

    హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళ్‌హాట్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో భరత్‌తో పాటు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

    అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఇతర ఆధారాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్, ఇతర సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

    అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
    316 Views
  • టీపీసీసీ కీలక నిర్ణయం...పాలభిషేకాలు, జేసీబీలపై నిషేధం.|
    హైదరాబాద్, జూలై 16 : కాంగ్రెస్ పార్టీ అధికారిక వేడుకలు, కార్యక్రమాల్లో ఆడంబరాలకు, ఆహార వృథాకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్వహించే ఎలాంటి కార్యక్రమాల్లోనైనా సరే పాలభిషేకాలు, జలాభిషేకాలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.  ఈ మేరకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ టి. కుమార్ రావు ఒక అధికారిక సర్క్యులర్ లేఖను విడుదల...
    228 Views
  • SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|
    "ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన" మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై 16: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) సూచించారు.  ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్...
    488 Views
  • అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
    అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు విభిన్న ప్రతిభావంతులు స్వయం ఆధారిత జీవితం గడపాలని, అంగవైకల్యం వారి ఆత్మగౌరవానికి అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి...
    223 Views
  • విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత
    వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఏపీసీసీ చీఫ్ విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత. ఎన్నికల్లో కూతలు.అనంతరం జనాలకు వాతలు ఇప్పుడు చిల్లరతో పాచికలు విద్యుత్ చార్జీల తగ్గింపు ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్నది మాయాజాలం.ట్రూ అప్ కింద భారీగా షాకులు పెట్టి.. ట్రూ డౌన్ పేరుతో ఆయిట్మెంట్ రాస్తున్నారు. రూ.15485 కోట్ల మేర సర్దుపోటు వేసి, ముష్టి రూ. 923 కోట్లు...
    208 Views
  • "అంతర్‌రాష్ట్ర దోపిడీ కేసు ఛేదన.. అల్వాల్ పోలీసులకు సీపీ రివార్డులు".|
    "డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వీరబాబు బృందాన్ని అభినందించిన సీపీ బి. సుమతి" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 16: అంతర్‌రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో దోపిడీ కేసును విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన అల్వాల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్‌కు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ రివార్డులు అందజేసినట్లు అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్...
    265 Views
  • Madanapalle: మదనపల్లెలో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటన. భద్రత, సభా ఏర్పాట్లపై కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉన్నత స్థాయి సమీక్ష.
    మదనపల్లె: ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా, పరిపాలనా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.   సీఎం సెక్యూరిటీ అదనపు ఎస్పీ...
    186 Views