అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్‌ ఉల్లంఘన..
భారత్ అవాజ్ / హుజూర్‌నగర్ రూరల్‌ :
ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్‌ పద్ధతులను అధికార యంత్రాంగం విధిగా పాటించవలసి ఉంటుంది. ప్రభుత్వం తరఫున మంత్రుల పర్యటన, ఇతర అధికారుల పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులకు వేదికలపై స్థానాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరుగుతున్న మంత్రుల పర్యటన, అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు సరైన రీతిలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని అనేకమంది ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి చెప్పలేక లోలోన మదనపడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్‌ ఉల్లంఘన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారికి సరైన రీతిలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నామినేటెడ్‌ పదవిలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్‌ ప్రకారం ముందు వరుసలో సంబంధిత వ్యక్తులకు స్థానాలు కేటాయించవలసి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా సరైన పద్ధతిలో స్థానాలు కేటాయించవలసి ఉంటుంది.
కానీ అధికారిక పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఎలాంటి హోదా లేని వారు సమావేశాల్లో ముందు వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అనేకమంది కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రోటోకాల్‌ ప్రకారం వేదికలపై స్థానాలు కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
సమావేశాల్లో మాజీలదే హవా...
అనేక సమావేశాల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కంటే మాజీ ప్రజాప్రతినిధుల హవా ఎక్కువ సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముందు ప్రోటోకాల్‌ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు.
అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్‌ ఉల్లంఘన.. భారత్ అవాజ్ / హుజూర్‌నగర్ రూరల్‌ : ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్‌ పద్ధతులను అధికార యంత్రాంగం విధిగా పాటించవలసి ఉంటుంది. ప్రభుత్వం తరఫున మంత్రుల పర్యటన, ఇతర అధికారుల పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధులకు వేదికలపై స్థానాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరుగుతున్న మంత్రుల పర్యటన, అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు సరైన రీతిలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని అనేకమంది ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి చెప్పలేక లోలోన మదనపడుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్‌ ఉల్లంఘన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారికి సరైన రీతిలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్‌ పదవిలో ఉన్నప్పటికీ ప్రోటోకాల్‌ ప్రకారం ముందు వరుసలో సంబంధిత వ్యక్తులకు స్థానాలు కేటాయించవలసి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా సరైన పద్ధతిలో స్థానాలు కేటాయించవలసి ఉంటుంది. కానీ అధికారిక పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎలాంటి హోదా లేని వారు సమావేశాల్లో ముందు వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అనేకమంది కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ప్రోటోకాల్‌ ప్రకారం వేదికలపై స్థానాలు కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమావేశాలు ఏకపక్షంగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సమావేశాల్లో మాజీలదే హవా... అనేక సమావేశాల్లో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కంటే మాజీ ప్రజాప్రతినిధుల హవా ఎక్కువ సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముందు ప్రోటోకాల్‌ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు.
0 Comments 0 Shares 125 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com