Andhra Pradesh
ముగతి గ్రామం పశువుల దాన సంచులు
నందవరం మండలం ముగతి గ్రామంలో పశుపోషణ సబ్సిడీ దాన సంచులు ఇవ్వబడును ఎవరైనా రైతు సోదరులు దాన కొరకు పసల ఆసుపత్రి దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందిగా ముగతి పశు ఆసుపత్రి వారు తెలియజేయడం జరిగింది.
ప్రజలకు చేరవుతున్న తపాలా శాఖ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి : ఎం వి వి రమణమూర్తి
చింతూరు తపాలా శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ చింతూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మారోజు వెంకట రమణ మూర్తి విజ్ఞప్తి చేశారు. ఒడిస్సా రాష్ట్రం నుండి బదిలీ పై చింతూరు లో బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేని గ్రామాల్లో సైతం తపాలా శాఖ కార్యాలయాలు నెలకొల్పి ప్రజలకు ఎన్నో విధాలైన సేవలను అందజేస్తున్నదని.. దట్టమైన అడవులు గిరిజన గ్రామాల కలిగిన చింతూరు ఏజెన్సీలో తపాలా శాఖ పథకాలను...
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLORE
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మద్యం షాపుల రెన్యూవల్: ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సిందేనన్న హైకోర్టు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుము వివాదంపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించి, లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దుకాణ యజమానులను ఆదేశించింది. దరఖాస్తులకు సెప్టెంబర్ 21 ఆఖరి తేదీ కావడంతో ఈ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రెన్యూవల్ ఫీజు తుది...
కీలక నియామకం.. ఏపీ ప్రభుత్వానికి కొత్త వాటర్ అడ్వైజర్..ఆయన ప్రత్యేకత ఏమిటంటే..!
ఏపీ జలవనరుల శాఖకు సలహాదారుగా అశోక్ గోయల్
రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం
అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రభుత్వానికి సలహాలు
ఢిల్లీ కేంద్రంగా కొనసాగనున్న గోయల్ సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖకు కొత్త సలహాదారును నియమించింది. కేంద్ర ప్రభుత్వ మాజీ అధికారి అశోక్ సీతారాం గోయల్‌ను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతారు....
మరోసారి యూరప్ పర్యటనకు జగన్.. షరతులతో సీబీఐ కోర్టు అనుమతి.
కుటుంబంతో కలిసిన యూరప్ పర్యటనకు వెళ్లనున్న జగన్
15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు
ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను ఇవ్వాలని కోర్టు ఆదేశం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన విదేశీ పర్యటనకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబ సమేతంగా యూరప్‌లోని తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, 15...
Madanapalle: వారణాసిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మదనపల్లె బీజేపీ నేత మిట్టా వంశీకృష్ణ. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పురస్కరించుకుని బీజేవైఎం బైక్ యాత్ర!
Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి హోదాల్లో ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బైక్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారణాసికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ యువ నాయకుడు మిట్టా వంశీకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు సింహం శ్రీకాంత్, టీచర్ల తదితరులు పాల్గొని...
Madanapalle: అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. స్పాట్లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేలా వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.
మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (AP FSL) ద్వారా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మంజూరు చేసిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించి జిల్లా క్లూస్ టీమ్ ఇన్చార్జి, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ బి. సునీల్‌కు అప్పగించారు. నేరస్థలంలో ఆధారాలను గుర్తించి, శాస్త్రీయంగా సేకరించేందుకు ఈ వాహనంలో హై-ఇంటెన్సిటీ...
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 4:50 గంటల సమయంలో హోటల్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇన్చార్జ్ అగ్నిమాపక కేంద్రాధికారి జె. బాబయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగతో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారు. అగ్నిమాపక...
Madanapalle: మదనపల్లె వలసపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. టమాటో బొలెరోను ఢీకొట్టిన లారీ, యువకుడు అక్కడికక్కడే మృతి.
Madanapalle: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, వలసపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన ముజీబ్ (24), ఇమ్రాన్ (30) టమోటాలు అన్లోడ్ చేసి బొలెరోలో మదనపల్లె వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో ఢీకొట్టింది. ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సకు తరలించారు. లారీ డ్రైవర్ తాలూకా పోలీసుల అదుపులో ఉన్నాడు.
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి సెల్‌ఫోన్ టార్చ్‌లతో వైద్యం అందించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ ఆగ్రహం.
మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్ టార్చ్‌లు, ద్విచక్ర వాహనాల హెడ్లైట్ల వెలుతురులో రోగులకు వైద్యం అందిస్తున్న పరిస్థితులపై బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీస పవర్ బ్యాకప్ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ.. రోగుల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్...
నందవరం మండలం అలహరివి గ్రామంలో జండా ఆవిష్కరణ
రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నందవరం మండలం హాలహర్వి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
More Blogs
Read More
The Public Square: Press Fostering Democratic Debate
The press possesses the unique strength of maintaining an open, pluralistic arena where opposing...
Meghalaya Strengthens Environment and Biodiversity Efforts
Meghalaya continues to strengthen its position as one of India's richest biodiversity regions...
సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి
సీఎం సహాయానిది పేద ప్రజల పెన్నిధి
భారత్ అవాజ్ సూర్యమోహన్తె తేలంగాణ కోడంగల్ జనవరి...
పుంగనూరు: అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు: ఆర్టీసీ ఈడీ
కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి,...
అక్రమ కేసుల వ్యవహారంలో ఘర్షణ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ...