Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.

0
190

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు

గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన వైనం

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వైసీపీ

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క, శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. 'ప్రతిపక్ష హోదా ఇవ్వాలి' అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. 

 

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

 

సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్ లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో, సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసినవారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర...
By Kothuru Murali 2026-03-13 08:54:32 0 188
Andhra Pradesh
వైజాగ్ కార్పొరేషన్ లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వం అమానుషం
*ప్రెస్ నోట్*   *తేదీ: 23-04-2026*   *విషయం: వైజాగ్ కార్పొరేషన్‌లో నడకపై...
By Rajini Kumari 2026-04-23 12:28:12 0 192
Sports
స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి...
By Avunoori Mahesh 2026-09-01 12:30:50 0 150
Telangana
శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్    కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ...
By Sidhu Maroju 2025-08-10 16:27:28 0 769
Andhra Pradesh
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...
By Pagadala Venkateswar 2026-02-24 07:14:55 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com