స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

0
142

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు 2026–27 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యులు  అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేయవచ్చని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలతో పాటు జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు SGFI వంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడాస్ఫూర్తితో పోటీపడి తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పోటీల ద్వారా తెలంగాణ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో: ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద శుక్రవారం విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...
By Kothuru Murali 2026-01-23 11:37:33 0 210
Andhra Pradesh
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾 ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ...
By Chennaiah Kati 2026-06-20 17:36:23 0 124
Andhra Pradesh
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:14:05 0 253
Andhra Pradesh
అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.
గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
By John Baji 2026-02-05 05:39:13 0 580
Telangana
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట...
By Katiyala JeevanRaj 2026-03-14 03:37:13 1 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com