అల్వాల్ ముంపు కష్టాలకు చెక్ : రూ. 2.3 కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులకు శ్రీకారం. |

0
228

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్టాలను తీర్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్ లోని చినరాయుడు చెరువు సమీపంలో రూ. 2.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రెయిన్ పనులకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వర్షపు నీటి నిల్వ సమస్యకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును మంజూరు చేయించామని కాలనీల నివాసితులు ముంపు భయం లేకుండా ఉండవచ్చని తెలిపారు.

 

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా అల్వాల్ సర్కిల్ వ్యాప్తంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని అధికారుల పర్యవేక్షణలో నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు. 

 

ఈ కార్యక్రమంలో... సర్కిల్ డి.ఈ ప్రశాంతి, ఏ.ఈ అరుణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ప్రతినిధులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.
మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే...
By Pagadala Venkateswar 2026-03-10 08:45:25 0 306
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు
పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్...
By Kothuru Murali 2026-07-17 04:28:49 0 235
International
U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again
ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం   వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా...
By G k Nookala 2026-07-08 05:26:59 2 631
Telangana
హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన...
By Ponnala Srinivasrao 2026-03-24 02:18:32 0 225
Andhra Pradesh
మహనీయుల త్యాగాలు మరువలేనిది
స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలు మరువలేనిదని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు....
By Boiena Rajesh 2026-08-12 13:54:33 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com