బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి

0
197

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు.బోయిన్ పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బిఅర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేసిఆర్ కు కొడుకు, కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు.బిఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండడం సహజమని తెలిపారు.కాలేశ్వరం విషయంలో సిబిఐ కాదు ఎవరు ఏమి చేయలేరని, కెసిఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేశ్వరం లాంటి బహుళార్థసాధక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కేసిఆర్ కే దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కూకట్‌పల్లి నుంచి చార్మినార్ వరకు మెరుపుల ముప్పు |
హైదరాబాద్ జిల్లా:హైదరాబాద్ నగరంలో వచ్చే 1–2 గంటల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన...
By Bhuvaneswari Shanaga 2025-10-07 08:18:07 0 31
Andhra Pradesh
'స్త్రీ శక్తి'తో ఉచిత ప్రయాణం.. 'తల్లకు వందనం' నిధుల విడుదల |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.   ...
By Meghana Kallam 2025-10-25 07:13:35 0 52
Gujarat
Cargo Ship Catches Fire at Porbandar Jetty |
A cargo ship named Haridarshan caught fire at Porbandar’s Subhashnagar Jetty while loading...
By Bhuvaneswari Shanaga 2025-09-22 12:17:30 0 65
Andhra Pradesh
ఆంధ్ర ఐటీకి శక్తినిచ్చే గూగుల్‌ డేటా హబ్‌ |
ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగాన్ని శరవేగంగా ముందుకు నడిపించే కీలక అడుగుగా, గూగుల్‌ సంస్థ...
By Bhuvaneswari Shanaga 2025-10-15 04:24:13 0 30
Telangana
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
By Sidhu Maroju 2025-06-13 14:53:57 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com