స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం : నగర కమిషనర్

0
212

కర్నూలు : స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం

• స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం
• నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
• ‘స్వచ్ఛ సర్వేక్షన్’ మార్గదర్శకాల అమలుపై సమీక్ష

కర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కమిషనర్ నివాస కార్యాలయంలో ‘స్వచ్ఛ సర్వేక్షన్’ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష సమావేశం కమిషనర్ నిర్వహించారు.

నగర స్వచ్ఛతను మరింత మెరుగుపరిచే దిశగా అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలని కమిషనర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు, విధివిధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలను చైతన్యపరిచే ర్యాలీలు, అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. వాల్ పెయింటింగ్స్, మైక్ అనౌన్స్మెంట్లు, వార్డుల మధ్య స్వచ్చత పోటీల ద్వారా ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవగాహన పెంచాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… స్వచ్ఛ నగర సాధన అనేది కేవలం నగరపాలక బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామిగా మారినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. ఇంటి నుంచే చెత్తను వేరు చేయడం, ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పుకు దారితీస్తాయన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలతో సమన్వయంగా పనిచేస్తూ కర్నూలును ఆదర్శ స్వచ్ఛ నగరంగా నిలబెడదామని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్, డిఈఈ పవణ్ రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాసులు, స్వచ్ఛ సర్వేక్షన్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఉమ్మడి ఏపీ మాజీ డిజిపి హెచ్.జె. దొర కన్నుమూత.|
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హెచ్.జె. దొర (83) (హనుమాన్తు...
By Sidhu Maroju 2026-03-13 13:04:09 0 158
Telangana
పెద్దపల్లి : సుల్తానాబాద్ లారీ ఇంజన్ లో మంటలు...!
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ శివారు రహదారి పై లారీ ఇంజన్ నుంచి ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి....
By Sunka Santhosh 2026-05-20 15:16:23 0 119
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలు
సోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ...
By Kothuru Murali 2026-03-27 14:52:01 0 162
Andhra Pradesh
అన్నమయ్య: మహిళపై కొడవలితో దాడి – పరిస్థితి విషమం.
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం, బోయకొండ యానాదిపాలెం గ్రామానికి చెందిన లేట్ పాపిరెడ్డి భార్య...
By Pagadala Venkateswar 2026-02-04 07:16:18 0 146
Andhra Pradesh
బెజ్జం వజ్రం హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. హైదరాబాదులో విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ నెంబర్డై,రెక్టర్లు
14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ అను ఎస్సీ మహిళ హత్య కేసులో పునర్విచారణ జరపాలని...
By Vadlamudi NagaVenkat 2026-04-03 11:34:28 0 350
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com