మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా అరెస్ట్

0
1K

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిసర ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు అక్కడ్నుంచి పారిపోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా అని పోలీసుల విచారణలో తేలింది. కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్ కొనసాగుతున్నారు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్, రెండు రేడియోలు, ఒక ఇయర్ ఫోన్, వాకిటాకీ, బ్యాటరీ, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
BMA
రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల జీవితం Beyond Byline: The Story of the Storyteller!
రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల...
By BMA (Bharat Media Association) 2025-09-04 11:03:03 0 214
Andhra Pradesh
నేవీతో రోల్స్ రాయిస్ కీలక ఒప్పందం |
భారత నౌకాదళ శక్తిని మరింత ఆధునీకరించేందుకు ఇండియన్ నేవీ, రోల్స్ రాయిస్ సంస్థతో కీలక ఒప్పందానికి...
By Bhuvaneswari Shanaga 2025-10-16 12:54:10 0 41
Bharat Aawaz
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...
By Bharat Aawaz 2025-06-27 11:11:22 0 1K
Telangana
కాంగ్రెస్ యువ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / మల్కాజిగిరి  మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్...
By Sidhu Maroju 2025-08-07 10:21:20 0 620
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com