Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
Madanapalle: మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్, ఎస్‌ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయ పరిసరాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.56 Views
-
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రెండో వార్డు నుంచి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప భార్య మల్లేశ్వరి, మూడో వార్డు నుంచి టీడీపీ నాయకుడు రఘుపతి నాయుడు భార్య కవిత కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారి విజయానికి మద్దతుగా యూనిట్ ఇన్‌చార్జి జయచంద్ర, జై భీమ్ నాయకులు కోన భాస్కర్, రామసుబ్బయ్య, సమర, మల్లికార్జున, బొరుగుల రమణ, ఆదెప్ప ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు కూడగడుతూ, భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండో, మూడో వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.1
56 Views -
రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని కీలక మున్సిపాలిటీలను టీడీపీ నేతృత్వంలోని కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ విజయాలతో జిల్లాపై టీడీపీ పట్టు సాధించినట్లయింది.
తాజా పరిణామాల ప్రకారం... ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ముఖ్యంగా రాయచోటిలోని మొత్తం 44 వార్డులను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకోవడం విశేషం. మిత్రపక్షమైన బీజేపీకి ఎర్రగుంట్ల మున్సిపాలిటీని కేటాయించి కూటమి ఐక్యతను చాటుకుంది. అంతేకాకుండా, జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీపై కూడా టీడీపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
అయితే, ఈ ఏకగ్రీవాలపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అధికార కూటమి అక్రమాలు, దౌర్జన్యాలతో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని, కొన్నిచోట్ల నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడులు, బెదిరింపులతో తమను ఎన్నికల నుంచి తప్పించలేరని ఆయన వ్యాఖ్యానించారు.50 Views -
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
క్యూలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారికి నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. రద్దీ సాధారణంగానే ఉన్నందున భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం నాడు మొత్తం 83,745 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 19,391 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ. 2.99 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది.50 Views -