Bharat Aawaz

35వ రోజుకు తెలంగాణ ఉద్యమకారుల దీక్షలు.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
3 min read
0
Comments
94
Views

● ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌

● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు

అల్వాల్, అక్టోబర్ 21:తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరం వేదికగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేసి, ఉద్యమంలో ముందుండి పోరాడారని నాయకులు పేర్కొన్నారు. వారి పోరాటాలను గుర్తించి తగిన గౌరవం కల్పించడంతోపాటు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన విధివిధానాలను త్వరితగతిన ఖరారు చేసి, అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

35వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బి. పరమేశ్వర్, పి. శ్రీనివాస్ గౌడ్, నగేష్ పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నల కృష్ణ, దయాకర్, ఢిల్లీ పరమేష్, ఆనంతుల సంతోష్, డోలి సుకుమార్, సంగమేశ్వర్, రాము తదితరులు పాల్గొని తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.

#Sidhumaroju

Alwal