Bharat Aawaz
Naveen Kumar
Naveen Kumar

Naveen Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member

@Naveenk46 Media Group
  • AI Designer at Palamaner
  • Chittoor
  • Studied Engineering at Acharya Nagarjuna University
Recent Updates
  • తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో టెన్షన్.. టెన్షన్!
    ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా CTR, TPT జిల్లాలో బుధవారం దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గురువారం నామినేషన్ల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. బుధవారం ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని, గుంపులు గుంపులుగా వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో గురువారం ఏం జరగనుందో అన్న టెన్షన్ నెలకొంది.
    44 Views
  • అమెరికాతో డీల్ క్యాన్సిల్ చేసుకోండి.. మోదీ సర్కారుకు వార్నింగ్
    అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అఖిల భారత కిసాన్ సభ (AIKS) మోదీ సర్కారును హెచ్చరించింది. వాషింగ్టన్కు ఇచ్చే రాయితీలు దేశంలోని వ్యవసాయ రంగానికి ముప్పు తెస్తాయని, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ డీలు వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. దాన్ని 'యాంటీ నేషనల్ డీల్'గా పేర్కొన్న AIKS ఆందోళనలకు సిద్ధం కావాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చింది.
    43 Views
  • చిత్తూరు: నేటి నుంచే నామినేషన్లు!
    ໖໘໖ 370 MPTC, 27 ZPTC   స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10,26,821 ఓటు వేసే హక్కు వినియోగించుకోనున్నారు. 1,236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 524 సాధారణ, 366 సున్నిత, 346 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 2,101 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికలకు పింక్, జడ్పీటీసీ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగించనున్నారు.
    87 Views
  • ఫేక్ ఐడీలు, అమ్మాయిల ఫొటోలతో 82 మందిని ట్రాప్ చేశాడు
    అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు ఏకంగా 27 ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సుమారు 82 మంది అబ్బాయిలను టార్గెట్ చేశాడు. వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను పంపించేలా చాట్ చేసి, వాటిని భద్రపరిచాడు. తర్వాత అమ్మాయి సోదరుడినంటూ బెదిరించి దాదాపు రూ.25 లక్షలకు పైగా వసూలు చేశాడు.
    95 Views
  • అల్పపీడనం.. ఉత్తర కోస్తాకు తుఫాన్ ముప్పు
    AP: ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 26వ తేదీ తర్వాత వాయుగుండంగా మారొచ్చని, 29 లేదా 30న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్గా తీరం దాటనుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు నేడు అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని SDMA తెలిపింది.
    99 Views
  • రోజా, పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ..!
    రాజకీయంగా చక్రం తిప్పిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరులో వైసీపీ నుంచి ఛైర్పర్సన్ పదవికి నామినేషన్ వేయకపోవడంతో TDP అభ్యర్థి నయీమా తాజ్ ఏకగ్రీవమయ్యారు. నగరిలో వైసీపీ అభ్యర్థులు రమేశ్ రెడ్డి, బాలకృష్ణ నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో TDP నుంచి శ్రీనివాసులు ఏకగ్రీవమయ్యారు. కీలకమైన మున్సిపాలిటీల్లో పదవులు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
    92 Views
  • ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో నిత్యావసరాల పంపిణీకి పరిశీలన
    TG: ఎల్నినో ప్రభావం, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రేషన్ షాపుల్లో నిత్యావసరాలు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు వంటి నిత్యావసరాలు అందించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందించాల్సిన పరిమాణాలు, సరకుల సేకరణ ఏర్పాట్లు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని లెక్కించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారట.
    105 Views
  • చిత్తూరు: జడ్పీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
    ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
    103 Views

    101 Views

    96 Views
  • నేడు భారీ వర్షాలు చురుగ్గా ‘ఈశాన్యం'.
    AP: కోస్తాంధ్ర, తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతం, కర్ణాటకలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని IMD వెల్లడించింది. ఉపరితల ద్రోణి కూడా విస్తరించినట్లు తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, రాష్ట్రంలో ఈ నెల 22 వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉ.8 గంటల వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వానలు, అన్నమయ్య, కడప, ప్రకాశం నుంచి కాకినాడ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
    161 Views
  • శాంతిభద్రతలకు వైసీపీ భంగం కలిగిస్తోంది: CM
    AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ చర్యలను గమనిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలని నాయకులకు సూచించారు. ఇవాళ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నిచోట్లా గెలవాలని, 2024 ఎన్నికలను మించి ఓట్ల శాతం పెరగాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
    153 Views
  • పుంగనూరు: ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కార్లు ఢీ
    పుంగనూరులో నిన్న రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సైతం పుంగనూరుకు వస్తానని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యా రు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఎంపీని పుంగనూరు నుంచి చౌడేపల్లి మార్గం వైపు తీసుకెళ్లి వదిలారు. అక్కడి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి, పలమనేరు మాజీ MLA వెంకటే గౌడ సదుం వైపు బయల్దేరారు. కాన్వాయ్లో ఉన్న ఎంపీ, మాజీ MLA కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఎవరికీ ఏమీ కాలేదు.
    146 Views
  • పుంగనూరు: MP రూముపై రాళ్లతో దాడి
    పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ కేంద్రం వద్దకు కాన్వాయ్ వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని కొందరు అడ్డుకున్నారు. పరస్పరం రాళ్ల దాడి జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని నామినేషన్ కేంద్రంలోని ఓ రూములోకి తీసుకెళ్లారు. బయట ఉన్న ఎంపీ కాన్వాయ్ వాహనాలు ధ్వంసం చేశారు. తర్వాత ఎంపీ ఉన్న రూము పైకి రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి DSP గాల్లోకి కాల్పులు చేసినట్లు సమాచారం.
    159 Views
  • ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు: SDMA
    AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్సుందని SDMA తెలిపింది. NLR, అన్నమయ్య, KDP, CTR, TPT జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. CTR, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని, 40–50KMPH వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
    164 Views
  • అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు: SDMA

    218 Views

    209 Views
More Stories