Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
తెలంగాణ సంస్కృతి గొప్పది: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
▫️బతుకమ్మ సంబురాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే
▫️ఉత్తర తిరుపతి దేవస్థానంలో బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు బతుకమ్మ పండుగలో ప్రతిబింబిస్తాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని గూపన్ పల్లి గంగస్థాన్ లో గల ఉత్తర తిరుపతి దేవస్థానం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా.. పండితులు ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగగు ఒక విశిష్టత ఉందని.. పూలనే కొలిచే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగలో కనిపిస్తుందని తెలిపారు.
అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.132 Views -
-
-
-
-
-
-