Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 14వ వార్డు కౌన్సిలర్‌గా మళ్లీ గెలిపించండి: బెల్లాల శ్రీనివాసరావు విజ్ఞప్తి
    పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరపున బెల్లాల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే వార్డుకు కౌన్సిలర్‌గా సేవలందించిన ఆయన, ఈసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వార్డులోని ఓటర్లందరూ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కౌన్సిలర్‌గా...
    375 Views

  • 18.10.2028
    నిజామాబాద్.

    పండుగల వేళ ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు.. రైల్వే బ్రిడ్జి ట్రాఫిక్ డైవర్షన్‌ను దీపావళి వరకు వాయిదా వేయాలి

    నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్

    నిజామాబాద్ నగరంలోని విజయ టాకీస్ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా ఈరోజు నుంచి అమలు చేస్తున్న ట్రాఫిక్ డైవర్షన్‌ను దీపావళి పండుగ వరకు వాయిదా వేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.

    దసరా పండుగకు కేవలం మూడు రోజుల ముందు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో నిజామాబాద్‌కు వచ్చి పండుగ కొనుగోళ్లు చేస్తుంటారని తెలిపారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం ప్రజలకు మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

    ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా వ్యాపారులు, చిరు వ్యాపారులు, వాహనదారులు, పండుగ కొనుగోళ్ల కోసం వచ్చే కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

    అభివృద్ధి పనులకు మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలి అని గణేష్ బిగాల స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, రైల్వే శాఖ అధికారులు సమన్వయంతో చర్చించి, దసరా మరియు దీపావళి పండుగలు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్‌ను వాయిదా వేయడంతో పాటు, బ్రిడ్జి విస్తరణ పనుల విషయంలో తగిన ప్రణాళిక రూపొందించాలని కోరారు.

    ప్రజల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని, పండుగల సమయంలో ప్రజలను ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గణేష్ బిగాల డిమాండ్ చేశారు.
    118 Views
  • తెనాలిలో నేడు(2వ రోజు)నామినేషన్ల జోరు
    తెనాలి. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నామినేషన్ కోలాహాలు నెలకొననుంది. ఈ రెండు రోజుల్లో వైసీపీకి చెందిన అభ్యర్థులు 25 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా 27 మంది కౌన్సిలర్లు,ఒక చైర్మన్ అభ్యర్థి నామినేషన్లు వేయాల్సి ఉన్నది. కూటమి తరఫున 52 మంది కౌన్సిలర్స్ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
    111 Views
  • తెనాలిలో సీట్ల సర్దుబాటు ఖరారు. మునిసిపల్ ఎన్నికలు....
    తెనాలిలో మునిసిపల్ ఎన్నికల టిడిపి అభ్యర్థుల జాబితా విడుదలైంది.మొత్తం 52 వార్డులకు గాను కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది.జనసేనకు 20,బీజేపీకి 1, మిగిలిన 31 వార్డుల్లో టిడిపి పోటీ చేస్తుంది. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించారు.30, 48 వార్డుల అభ్యర్థుల పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.
    137 Views
  • బతుకమ్మా పండుగ సంబరాలు
    మిర్యాలగూడ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం *గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ* వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను *డీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ చిలుకూరి బాలకృష్ణ గారు* సందర్శించి పరిశీలించారు.   ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, వేడుకలు సజావుగా నిర్వహించేందుకు జరుగుతున్న పనులను...
    128 Views
  • 11వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నెయ్యాల రీట నామినేషన్
     * వార్డు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి  * భారీగా తరలివచ్చిన మద్దతుదారులు, వార్డు ప్రజలు పలాస: స్థానిక ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు నుండి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగా చించాన మను సతీమణి నెయ్యాల రీట తన నామినేషన్ దాఖలు చేశారు. వార్డులోని పెద్దలు, మహిళలు, యువత మరియు తన మద్దతుదారులతో కలిసి ఉత్సాహంగా తరలివెళ్లిన ఆమె, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను...
    448 Views
  • పెద్దిరెడ్డిపల్లి పంచాయతీలో రూ.60 లక్షలకు పైగా సీసీ రోడ్లు.. డ్రైనేజీ నిర్మాణంతో మారిన గ్రామ రూపురేఖలు..!
    గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి చొరవతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు..!   ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి పంచాయతీలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చొరవతో రూ.60 లక్షలకు పైగా అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు డ్రైనేజీ సదుపాయాన్ని కల్పించడం జరిగింది.   గతంలో సరైన రహదారులు లేక గ్రామ ప్రజలు అనేక...
    148 Views
  • 🔸చిన్నారి తనిష్క మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు..!
    వరికుంటపాడు మండల కేంద్రంలో బిగ్ టీవీ రిపోర్టర్ తాళ్లూరి చిన్నయ్య గారి కుమార్తె చిన్నారి తనిష్క మొదటి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా చిన్నారి తనిష్కకు అక్షింతలు వేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చిన్నారి జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలని,...
    138 Views