Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
*ఎండాకాలం వస్తే చుక్కనీరు దొరికే పరిస్థితి లేదని..!!, ఎండు వేడికి బయటకు వచ్చి పరిస్థితి కూడా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.* టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన *సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..* మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు. ఎల్‌నినో, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. *కరువు ప్రారంభమైనప్పుడు నొప్పి తెలియదని, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం కన్పిస్తుంది* అన్నారు. కరువుపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. *కాంగ్రెస్ తెచ్చిన కరువని చెప్పడానికి మామా అల్లుళ్లే తెలివైనవారా.?* అని ప్రశ్నించారు. *మహారాష్ట్రలో కూడా కరువు ఉందని, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్‌షాపుల్లో నీళ్లు ఇస్తున్నారని..!!🤔* చెప్పారు. *కరువు ప్రారంభంలో చిన్నగా ఉన్నా, జులై నాటికి తీవ్రంగా ఉంటుందని* హెచ్చరించారు. *ఎండ వేడి పెరుగుతుందని... సాగునీరు కాదు, తాగునీటికి కూడా కష్టం వస్తుంది* అని వ్యాఖ్యానించారు. *ఎండలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని..😇* అన్నారు. *కరోనా వస్తే కేసీఆర్ క్రోసిన్ వేసుకుంటే పోతుందని చెప్పారని, కేసీఆర్ మాటలు నమ్మి కరోనా సమయంలో చాలా మంది చనిపోయారని* అన్నారు. *హరీష్‌రావు మాటలు నమ్మి పంటలు వేయొద్దని, హరీష్‌రావును నమ్మితే మట్టితో అంబలి చేసుకునే పరిస్థితి వస్తుందని..!!* అన్నారు. భూకంపం, సునామీ, కరువు ఇవన్నీ ప్రకృతి విపత్తులేనని చెప్పారు. కాలం గడిచేకొద్దీ ప్రకృతి విపత్తుల ప్రభావం తగ్గిపోతుందని అన్నారు. *ప్రకృతి విపత్తులు వద్దనుకుంటే ఆగేవి కావు* అన్నారు. *ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా కొన్నిసార్లు తప్పించుకోలేం* అన్నారు. రోజులు గడుస్తున్న *కొద్ది కరువు మనల్ని కబలిస్తుంది* అని వ్యాఖ్యానించారు. కరువుపై తాము 6 నెలల నుండి అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. *వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉందని* అన్నారు. దీని ప్రభావం ఒక్కోచోట ఒక్కోలా ఉంటుందని చెప్పారు. బ్రిటిష్ వాళ్లకు కూడా కరువు ప్రభావం ఉందని అన్నారు. అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, దేశాలు కరువును ఎదుర్కొంటున్నాయని చెప్పారు.23 Views
-
-
-
-
-
Annamayya: అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి పూర్తి పోలీసు రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు తెలిపారు. ఎవరైనా నామినేషన్లను అడ్డుకున్నా లేదా బెదిరింపులకు పాల్పడినా వెంటనే స్థానిక ఎస్ హెచ్ ఓ, సీఐ లేదా డీఎస్పీల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అలాంటి ఫిర్యాదులపై తక్షణమే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.20 Views
-
-