*ఎండాకాలం వస్తే చుక్కనీరు దొరికే పరిస్థితి లేదని..!!, ఎండు వేడికి బయటకు వచ్చి పరిస్థితి కూడా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.* టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన *సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..* మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు. ఎల్‌నినో, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. *కరువు ప్రారంభమైనప్పుడు నొప్పి తెలియదని, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం కన్పిస్తుంది* అన్నారు. కరువుపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. *కాంగ్రెస్ తెచ్చిన కరువని చెప్పడానికి మామా అల్లుళ్లే తెలివైనవారా.?* అని ప్రశ్నించారు. *మహారాష్ట్రలో కూడా కరువు ఉందని, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్‌షాపుల్లో నీళ్లు ఇస్తున్నారని..!!🤔* చెప్పారు. *కరువు ప్రారంభంలో చిన్నగా ఉన్నా, జులై నాటికి తీవ్రంగా ఉంటుందని* హెచ్చరించారు. *ఎండ వేడి పెరుగుతుందని... సాగునీరు కాదు, తాగునీటికి కూడా కష్టం వస్తుంది* అని వ్యాఖ్యానించారు. *ఎండలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని..😇* అన్నారు. *కరోనా వస్తే కేసీఆర్ క్రోసిన్ వేసుకుంటే పోతుందని చెప్పారని, కేసీఆర్ మాటలు నమ్మి కరోనా సమయంలో చాలా మంది చనిపోయారని* అన్నారు. *హరీష్‌రావు మాటలు నమ్మి పంటలు వేయొద్దని, హరీష్‌రావును నమ్మితే మట్టితో అంబలి చేసుకునే పరిస్థితి వస్తుందని..!!* అన్నారు. భూకంపం, సునామీ, కరువు ఇవన్నీ ప్రకృతి విపత్తులేనని చెప్పారు. కాలం గడిచేకొద్దీ ప్రకృతి విపత్తుల ప్రభావం తగ్గిపోతుందని అన్నారు. *ప్రకృతి విపత్తులు వద్దనుకుంటే ఆగేవి కావు* అన్నారు. *ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా కొన్నిసార్లు తప్పించుకోలేం* అన్నారు. రోజులు గడుస్తున్న *కొద్ది కరువు మనల్ని కబలిస్తుంది* అని వ్యాఖ్యానించారు. కరువుపై తాము 6 నెలల నుండి అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. *వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉందని* అన్నారు. దీని ప్రభావం ఒక్కోచోట ఒక్కోలా ఉంటుందని చెప్పారు. బ్రిటిష్ వాళ్లకు కూడా కరువు ప్రభావం ఉందని అన్నారు. అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, దేశాలు కరువును ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
5 Views