Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
రోలుగుంట జడ్పీటీసీకి వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరి నామినేషన్
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీలో పోటీ వేడెక్కింది. నిన్న రోలుగుంట మండలం నుంచి యర్రంశెట్టి శ్రీనివాసరావు జడ్పీటీసీకి నామినేషన్ వేయగా, నేడు అదే స్థానానికి రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన కుంచంగి వంశీ రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో రోలుగుంట జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ నుంచే ఇద్దరు నామినేషన్ వేసినట్లు అయింది. కొంతలం గ్రామానికి చెందిన వంశీ రవీంద్ర యువనేతగా స్థానికంగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. ఒకే మండలం, ఒకే పార్టీ నుంచి ఇద్దరు జడ్పీటీసీ బరిలోకి దిగడంతో పార్టీలో చర్చ మొదలైంది. అధిష్టానం ఎవరికి బీఫాం ఇస్తుందనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.30 Views -
-
-
🚨 మిర్యాలగూడ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు! 🚨
నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రూ.37.95 కోట్ల పరిపాలనా అనుమతి!
మిర్యాలగూడ బైపాస్‌లోని నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం G.O.Rt.No.545, తేదీ 22-10-2026 ద్వారా పరిపాలనా అనుమతి మంజూరు చేయడం సంతోషకరం.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ముఖ్యంగా, మిర్యాలగూడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, నందిపాడు జంక్షన్ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించేలా నిరంతరం కృషి చేసి, సమస్య పరిష్కారం కోసం పట్టుదలతో ముందుకు సాగిన మిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించి, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.
ప్రభుత్వ అనుమతి తొలి అడుగు.. టెండర్లు పూర్తిచేసి నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే తదుపరి లక్ష్యం!
మిర్యాలగూడ అభివృద్ధి కోసం మరిన్ని ప్రజోపయోగ పనులు కార్యరూపం దాల్చాలని కోరుకుంటూ...
✍️ రియాజ్ అహమ్మద్
భారత్ అవాజ్
మిర్యాలగూడా34 Views -
-
నల్గొండ బ్రేకింగ్:
భారత్ అవాజ్
నందిపాడు బైపాస్ వద్ద ఇక రోడ్డు ప్రమాదాలకు చెక్!
మిర్యాలగూడ నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రూ.37.95 కోట్ల నిధులు మంజూరు..
అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
నిర్మాణ పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశాలు..
నందిపాడు జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు త్వరలో పరిష్కారం...
వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం..
నిధుల మంజూరుపై *రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి* కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు జిల్లా నాయకులు...1
33 Views -
-