Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లె: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున జయ భవ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జయ భవ్య మాట్లాడుతూ జనసేన పార్టీ తనను గుర్తించి జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
    20 Views
  • మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ సీనియర్ నాయకుడు మునిరత్నం నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రంలో ఆయన నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు
    19 Views
  • మదనపల్లె: సీటీఎం-1 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున 68 ఏళ్ల ఉత్తమ్మ నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను సహాయకులు పట్టుకుని నామినేషన్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళా రిజర్వేషన్ కారణంగా పోటీ చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపినట్లు సమాచారం. మరోవైపు, యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న జనసేన పార్టీ 68 ఏళ్ల వృద్ధురాలిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
    19 Views
  • మదనపల్లె: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు సతీమణి రాటకొండ రెడ్డమ్మ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా రెడ్డమ్మను బరిలో నిలిపినట్లు తెలిపారు. ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే మదనపల్లె మండల అభివృద్ధికి కృషి చేస్తామని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని తెలిపారు.
    20 Views
  • Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో జడ్పిటిసి అభ్యర్థులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరఫున టీ. రాజన్న, ఆయన కుమారుడు విశ్వనాధ్ నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తండ్రి కొడుకులు జడ్పిటిసి అభ్యర్థులుగా వైసీపీ తరఫున నామినేషన్లు వేయడంతో స్థానికంగా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
    25 Views
  • నామినేషన్ల స్క్రూటినీ స్టార్ట్.. అభ్యర్థుల మధ్య ముళ్లకంచె
    APలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. అనంతపురంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. TDP, YCP అభ్యర్థుల మధ్య ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. అటు తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు రేపు 5PM వరకు అవకాశం ఉంటుంది. 27న 3PM తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
    47 Views
  • గరివిడి జడ్పీటీసీ పోరు ఆసక్తికరంగా మారుతోంది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ఒకవైపు.. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య మరోవైపు బరిలో నిలవనుండటంతో రాజకీయంగా ఈ పోటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కీలక నేతల కుటుంబాల మధ్య జరగనున్న ఈ పోరులో గరివిడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
    27 Views
  • గరివిడిలో బిగ్ ఫైట్.. బొత్స వర్సెస్ కళా!
    గరివిడి జడ్పీటీసీ పోరు ఆసక్తికరంగా మారుతోంది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ఒకవైపు.. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య మరోవైపు బరిలో నిలవనుండటంతో రాజకీయంగా ఈ పోటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కీలక నేతల కుటుంబాల మధ్య జరగనున్న ఈ పోరులో గరివిడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. #RAJESH 
    41 Views
  • ఉదయం టీడీపీకి.. మధ్యాహ్నం జనసేనకు నామినేషన్
    బాడంగి మండలంలో ఎన్నికల విచిత్రం చోటు చేసుకుంది. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన మత్స శిరీష శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా.. మధ్యాహ్నం జనసేన అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు. ఒకే అభ్యర్థి రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేయడంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతుంది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేసినట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు....
    34 Views
  • జిల్లాలో పెరుగుతున్న శిశు మరణాలు
    విజయనగరం జిల్లాలో శిశు మరణాల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 149 మంది శిశువులు, నలుగురు గర్భిణులు ప్రాణాలు కోల్పోయారు. 2025లో 307 శిశు మరణాలు, 10 మాతృ మరణాలు సంభవించాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. #RAJESH 
    39 Views