Bharat Aawaz

చిలకలూరిపేటలో దారుణం: మాజీ మంత్రి విడదల రజినిని తోసి కింద పడేసిన ఎస్ఐ ప్రియాంక!*

VALLERU SIMHADRI
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
29
Views

చిలకలూరిపేట రూరల్:* చిలకలూరిపేటలో మరోసారి పోలీసు దౌర్జన్యం బయటపడింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత *విడదల రజిని గారిని* చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ *ప్రియాంక* గట్టిగా తోసి కింద పడేసినట్లు తెలుస్తోంది.

 

నామినేషన్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్లిన రజిని గారిని అడ్డుకునే క్రమంలో ఎస్ఐ దురుసుగా ప్రవర్తించి తోసివేయడంతో ఆమె కింద పడిపోయారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

 

ఒక మహిళా మాజీ మంత్రి పట్ల, అదీ ఒక మహిళా ఎస్ఐ ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు వ్యవస్థ ఇలా కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారడం దారుణమని నేతలు మండిపడుతున్నారు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.