Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నేటి నుంచే ‘పోలీస్ యాక్ట్-30 అమలు జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు ఆంక్షలు
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలంలో ప్రజలందరూ పోలీసు నిబంధనలకు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ శాఖ...
    543 Views
  • Ranganath | రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయండి : హైకోర్టు
    Ranganath | హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది.
    Ranganath | హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని.. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొన్నది. చట్ట పరిధిలో మాత్రమే పాలన కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని హెచ్చరించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించండి అని సీఎస్‌కు ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
    457 Views
  • చింతూరు శబరి, సోకిలేరు ఉగ్రరూపం.. స్తంభించిన రాకపోకలు!
    పోలవరం జిల్లా చింతూరు మండలం నుండి వి,ఆర్,పురం మండలనికి ప్రధాన రహదారి పై వున్న సోకిలేరు వాగుపై బ్రిడ్జి ఆకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వి.ఆర్.పురం - చింతూరు మండలాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.ముందుగానే గర్భిణీలను, అనారోగ్యంతో ఉన్నవారిని నాటు పడవలు, రహదారి మీదుగా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో నాటు పడవలు, బోట్లు అలాగే NDRF సిబ్బందిని సహాయక...
    275 Views
  • విశాఖ ఇకపై నేషనల్ కాదు ఇంటర్నేషనల్!!!!!
    విశాఖ ఇకపై నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న చంద్రబాబుగారి దార్శనిక ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోనుంది అంటున్నారు. అది ఎలాగో ఈ వీడియో చూసి తెలుసుకోండి. #UttarandhraKalalakuRekkalu #BhogapuramAirport #AlluriSitaramaRajuAirport #GatewayToUttarandhra  #chandrababunaidu
    406 Views
  • పాత కేసులు... కొత్త కటకటాలు.|
    ● సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి సంయుక్త దాడి ● నిందితుడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం ● గతంలోనూ నాలుగు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదైనట్లు వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 1: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడిలో 280 గ్రాముల గంజాయితో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూరారం...
    231 Views
  • అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికేట్'
    ప్రజా ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికేట్'ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు తెలిపారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే ధృవీకృత పత్రంతో సులభంగా సమర్పించేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందన్నారు. సమీప తహసీల్దార్ కార్యాలయం లేదా మీ సేవ కేంద్రంలో ఫ్యామిలీ...
    241 Views
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు కొనసాగిస్తున్నామని, అనుమతి లేని డ్రోన్లు, డీజే లపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సిపి అంబర్ కిషోర్ తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1,2026 వరకు ఈ నిషేధాలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
    404 Views
  • Bhogapuram airport inauguration
    భోగాపురం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు.   ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి...
    276 Views