• Padi parishram director meet c m
    ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా గారు, మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ జయతీర్థ చారి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.   ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు,...
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
  • మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
    ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బి. కొత్తకోటకు చెందిన వెంకటరమణ, ఆటో మరమ్మత్తు కోసం స్పేర్ పార్ట్స్ తీసుకుని బైక్‌పై మదనపల్లెకు వచ్చాడు. సిటిఎం రోడ్డులో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
  • ముంబై-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బస్ట్… నైజీరియన్ మహిళ అరెస్ట్.|
    హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్ తరలిస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబై నుంచి నగరానికి భారీగా మాదకద్రవ్యాలు రవాణా జరుగుతున్నాయన్న గోప్య సమాచారం అందడంతో డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ బృందం అప్రమత్తమైంది....
    0 Comments 0 Shares 99 Views 0 Reviews
  • అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ పరిధిలోని కనాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ని ఆహ్వా నించారు.  ఈ వేడుకల్లో ప్రాంతీయ ప్రజలు, బస్తీ వాసులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు....
    0 Comments 0 Shares 103 Views 0 Reviews
  • పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
    వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా గడవకముందే పేకమేడల్లా కూలిపోతున్న రాతి గద్దెలు..!! ‎ఇది మేడారంలో జరిగిన ప్రమాదం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తితో చేసిన ప్రభుత్వ హత్య ‎వందల కోట్లు ఖర్చు చేశామని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి , సీతక్క... మీ నాణ్యత లేని నిర్మాణాల వల్ల ఇవాళ ఒక పూజారి బిడ్డ తన కాలును కోల్పోయి,...
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని .

    డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం.

    రికార్డు స్థాయి పనులు

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని . డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం. రికార్డు స్థాయి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    0 Comments 0 Shares 157 Views 0 Reviews
  • AVN lake field global school inauguration
    రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్‌ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.   *YouTube* https://www.youtube.com/live/JN6FxAEzZoQ?si=2SraBe_Bccs_XaJf     *X* https://x.com/TelanganaCMO/status/2040080101698830427?s=20     *Facebook* https://www.facebook.com/share/v/1C7yNBC8vc/
    0 Comments 0 Shares 62 Views 0 Reviews
  • ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సేవా పరమో ధర్మ ఫౌండేషన్ ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందించే ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్వాల్ సిఐ ప్రశాంత్ రిబ్బన్ కట్టింగ్ చేసి చలివేంద్రాలను...
    0 Comments 0 Shares 99 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 72 Views 0 Reviews
  • Breaking News from Iran
    ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇద్దరు అమెరికన్‌ పైలెట్‌లను అదుపులోకి తీసుకున్నామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డు కోర్‌...
    0 Comments 0 Shares 70 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com