జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన సందర్భంగా, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి సోమవారం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా జలాలతో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని, మదనపల్లె ఔటర్ రింగ్ రోడ్డు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేయాలని కోరారు. మదనపల్లె–రామసముద్రం రహదారిని విస్తరించి, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని...
జూన్ 20న మదనపల్లె రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, వాల్మీకి బోయలకు ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ హామీని వెంటనే అమలు చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన ఆయన, విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వాల్మీకి బోయల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, మదనపల్లెలోని...
మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బొమ్మన్‌చెరువుకు చెందిన రెడ్డప్ప (56)ను మాలెపాడు దేవలంపల్లికి చెందిన నరసింహులు ఇంటికి పిలిచి, అల్లుడు బాలాజీకి సంబంధించిన విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నరసింహులు కర్రతో దాడి చేయడంతో రెడ్డప్ప గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు...
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా, అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలను మదనపల్లె కేంద్రం నుంచి వివిధ నియోజకవర్గాలకు సోమవారం తరలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి చెందిన ఓ బాధితుడు తన కుమారుడిని భుజాలపై మోసుకుని వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావడం లేదని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే న్యాయం చేసి పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరాడు.
మదనపల్లెలో సంచలనం రేపిన హని వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు ఆర్థికంగా అన్యాయం జరిగిందని ఉమాదేవి చేసిన ఆరోపణలను కుటుంబ సభ్యులు ఖండించారు. గతంలో పెద్దల సమక్షంలో కుదిరిన రాజీ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను, వివరాలను వారు సోమవారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఉమాదేవి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే, ఉమాదేవి వర్గం మాత్రం భిన్న...
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్ కేసులు లేకుండా అర్జీదారులు సంతృప్తి...
అన్నమయ్య జిల్లా యంత్రాంగం 22-A భూ సమస్యలకు పరిష్కారం చూపింది. మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్ల పరిధిలో 27 మంది రైతులకు చెందిన 27.31 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరిస్తామని జేసీ పేర్కొన్నారు.
జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి
16-06-2026 Tue
Andhra
Pawan Kalyan pays tribute to martyred soldiers at National War Memorial
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు
తెలుగు రాష్ట్రాల సైనికులకు ప్రత్యేకంగా శ్రద్ధాంజలి
జనసేన కార్యక్రమం కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్
స్మారక ప్రాముఖ్యతను...
సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!
Andhra
Chandrababu Naidu gets massive convoy in Singapore as PM Lawrence Wong provides top protocol
సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అగ్రస్థాయి ప్రొటోకాల్
పోలీస్ ఎస్కార్ట్‌తో భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసిన సింగపూర్ ప్రభుత్వం
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో 30 నిమిషాల పాటు కీలక చర్చలు...