Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "అల్వాల్ విషాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన సందీప్, ఆయన కుమార్తె రీతిక కుటుంబ సభ్యులను మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు.  శనివారం తెల్లవారుజామున టెలికం కాలనీలో జరిగిన ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, భార్య కళ్లముందే భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారక సంఘటన అని పేర్కొన్నారు....
    70 Views
  • "జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
    హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలకు పలు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న భారీ వర్షాలు కురిసిన సమయంలో అధికారులు...
    645 Views
  • "జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
    హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలకు పలు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న భారీ వర్షాలు కురిసిన సమయంలో అధికారులు...
    54 Views
  • "సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
    సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 14న ప్రత్యేక బృందం క్లూస్ టీమ్, స్వతంత్ర సాక్షులతో కలిసి దేవకి లాడ్జ్‌లో సోదాలు...
    219 Views
  • నందవరం మండల కేంద్రంలోని శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది
    నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలు గుడిసె చిన్న తిమ్మప్ప సరోజమ్మ కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    283 Views
  • అందరికీ నమస్తే.
    ఈ రోజు శ్రీ రంగనాథ్ గారు, HYDRA కమిషనర్, శ్రీ జోయెల్ డేవిస్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్, హైదరాబాద్, శ్రీ రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్-III, శ్రీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ, రాజేంద్రనగర్ జోన్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, జోనల్ కమిషనర్, రాజేంద్రనగర్ జోన్, ఇతర GHMC, HYDRA అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసు అధికారులు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ బాబా వాటర్ లాగింగ్ పాయింట్, పిల్లర్ నెం. 265 మరియు ఇతర వాటర్ లాగింగ్‌ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.
    వాటర్ లాగింగ్‌కు గల కారణాలను ఫీల్డ్ సిబ్బందితో చర్చించి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీరు సాఫీగా ప్రవహించేందుకు మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు సిల్ట్, చెత్త మరియు ఇతర వ్యర్థాలను తొలగించి, వాటర్ లాగింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
    1.1K Views
  • తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎస్. విక్రమ్ కుమార్ మరియు కార్యదర్శి శ్రీ కురాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, శాఖల యూనియన్ నాయకులు కలిసి టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎమ్. హుస్సేని (ముజీబ్) గార్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

    ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో హైదరాబాద్ జిల్లాలోని టీఎన్‌జీఓస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎక్కడికక్కడ తమ ప్రస్తుత పని ప్రదేశాలలోనే కొనసాగేలా కేంద్ర సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.

    ఈ సమావేశంలో టీఎన్‌జీఓ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీమతి ఉమ (కోశాధికారి), శ్రీ కొండల్ రెడ్డి (ఉపాధ్యక్షులు), శ్రీ నరసింహారెడ్డి (ఉపాధ్యక్షులు), మరియు శ్రీమతి శైలజ (సంయుక్త కార్యదర్శి) గార్లు కూడా పాల్గొన్నారు.

    అలాగే జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్ కుమార్, ఈసీ مెంబర్ శ్రీ ముఖీమ్ ఖురేషి గార్లతో పాటు ఖైరతాబాద్, అమీర్‌పేట్, కింగ్ కోఠి, జగమ్మేట్, నాంపల్లి, గోల్కొండ ఆసుపత్రుల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వర్క్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ పేమెంట్, ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్, నిలోఫర్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు ఈసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    కృతజ్ఞతలు తెలిపిన అనంతరం, హైదరాబాద్ జిల్లా పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ, కార్మిక ఉపాధి మరియు శిక్షణ శాఖలలో నిబంధనలకు విరుద్ధంగా, మానవతా దృక్పథం లేకుండా జిల్లా దాటించి బదిలీ చేసిన పలువురు ఉద్యోగుల సమస్యలను విక్రమ్ కుమార్ గారు కేంద్ర సంఘం నేతలకు వివరించారు.
    ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో (పోస్ట్-న్యూరోసర్జరీ, ఫిట్స్) బాధపడుతున్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు సెక్టార్ పరిధి దాటకుండా చూడాలని, అలాగే భర్త హైదరాబాద్‌లో పనిచేస్తూ భార్యను అన్యాయంగా సంగారెడ్డికి బదిలీ చేసిన ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 లాంటి వారిని తిరిగి డెప్యుటేషన్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కేంద్ర సంఘం నాయకత్వాన్ని కోరారు.
    దీనిపై టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలను వెంటనే సదరు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులందరికీ త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
    514 Views
  • కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ
    🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్, సోమవారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, లాకప్ రూమ్, రిసెప్షన్, రికార్డులను పరిశీలించిన ఆమె, విధి నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అక్రమ రవాణా,...
    418 Views
  • విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
    శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.అనంతరం గోవిందాపూర్ సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదుల మరియు ఇతర మౌళిక వసతులకోసం చేపట్టబోయే పనులకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా, వైద్యం, అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం...
    620 Views
  • శేరిలంక గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం – పలువురికి ఉచిత కంటి ఆపరేషన్లు
    కే. గంగవరం మండలం, శేరిలంక గ్రామంలో మామ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో, కొండేపూడి అర్జున్ సహకారంతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 14-06-2026న విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స మరియు ఆపరేషన్ కోసం ఎంపిక చేసింది. శిబిరంలో గుర్తించిన రోగులను 15-06-2026న కాకినాడలోని...
    629 Views