Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని లక్ష్మణరావు తొ పాటు గ్రామంలో ఉన్న 10 వార్డులో కూటమి అభ్యర్ధిలు విజయం సాధించారు కాగా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి తంబురీ దయాకర్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు!!!!!!!!!!!!
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు2026 మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4వ తేదీకి మార్పుహోలీ కారణంగా ఒకరోజు వాయిదా వేసిన ఇంటర్ బోర్డు
#Sivanagendra #Telangana
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని సీఐ రాజ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీఐ రాజ్‌కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.
ఈ ఫ్లాగ్ మార్చ్‌లో మరిపెడ సర్కిల్‌కు చెందిన ఎస్సైలు, పోలీసు...
మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా (IFS) గారిని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లిం, క్రైస్తవ సముదాయాల ప్రజలకు స్మశాన వాటిక కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే వినతి పత్రాన్ని సమర్పించారు.
నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా...
వైదిక బ్రాహ్మణ సంఘం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖల మంత్రి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు ని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని...
నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుండి 31 లక్షల విలువైన బంగారు,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
బోయిన్ పల్లి కి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్య లు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారు ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం...
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్ నిలయం ప్రాంతాలలో ఎన్నో ఏళ్లుగా మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల అవస్థలను గుర్తించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి,అధికారులతో నిరంతరం మాట్లాడి 70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయింపజేశారు.
సోమవారం HMWS & SB ద్వారా పనులను, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ...
గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా
మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించండి
కొత్తగూడ డిసెంబర్ 15, (భారత్ అవాజ్): మహబూబాబాద్: కొత్తగూడ మండలంలోని రామన్నగూడెం తండా గ్రామ అభివృద్ధి కోసం తన సాయి శక్తుల కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి బానోత్ సుగుణ-కిషన్ నాయక్ హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు, వారి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన పనుల కోసం నిధులు తెచ్చి పనిచేస్తానని అభివృద్ధి పనులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రజల సమస్యల పరిష్కారం కోసం...
కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*
*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!*
*కురవి గ్రామంలో వందలాది మంది పశువుల వ్యాపారం చేస్తున్నారు.., వాళ్ళందరు చేస్తున్నది తప్పేనా..!!*
*సంతలో బ్రోకర్ పని గ్రామంలో వందలాది మంది చేస్తున్నారు.. వాళ్ళందరూ చేస్తున్నది మీ.. దృష్టిలో తప్పేనా...!!*
*వాళ్ళందరి కుటుంబాల ఓట్లు మీకు అవసరం లేదు కదా..!!*
*మిస్టర్ రాంచందర్ నాయక్..!! తుకారాంనాయక్ చేస్తున్న వ్యాపారం ఏంటో అసలు నీకు తెలుసా...??!!*
*పేదవాడు,...
చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు...
మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి పై విజయం సాధించారు, ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఊరి ప్రజలకు తోడుగా ఉంటున్న నాయకుడి గెలుపుతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
బిజెపి అభ్యర్థి తో...బిఆర్ఎస్ కు ఓటువేయమంటున్న మాజీ మంత్రి
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ ఆవాజ్): మండల కేంద్రంలో స్థానికల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బిజెపి బలపరిచిన అభ్యర్థితో బిఆర్ఎస్ కు ఓటు వేయమని సరదాగా అడుగుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని లక్ష్మణరావు చిలుకు ఓట్లతో విజయం సాధించారు.అలాగే గ్రామంలో ఉన్న 10 వార్డుల కూటమి కైవసం చేసుకుంది. ఇంత గొప్ప విజయాని అందించిన గ్రామ ప్రజలుకు కూటమి అభ్యర్ధిలు ధన్యవాదాలు తెలిపారు.
More Blogs
Read More
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి
తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా...