Ramzan starts from tomorrow

0
223

*_ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్_*

 

_ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు._

 

_అయితే రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే._

 

_ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్ర పండుగా భావించే రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. పవిత్ర మక్కా మసీదు నెలకున్న సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అలాగే సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది. భారత్ లో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ మాసం ప్రారంభం అయినట్టుగా భావించవచ్చు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు._

 

_మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఈ మేరకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు._

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో యువకుడి హత్య..! తలకు తీవ్ర గాయం, మెడ చుట్టూ కత్తిపోట్లు
చీరాల:  చీరాల పట్టణంలోని ఆర్ఓబి క్రింద గుర్తు తెలియని యువకుడు మృతదేహం స్థానికులను...
By Gadiyapudi Narendra 2026-01-28 12:06:06 0 255
Andhra Pradesh
Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి.
కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం   నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్...
By Pagadala Venkateswar 2026-01-31 10:31:28 0 520
Andhra Pradesh
గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం
బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో...
By Boiena Rajesh 2026-03-29 04:14:13 0 239
Andhra Pradesh
AP SSC 2025 Supplementary Exams Started From today onwards
The Board of Secondary Education, Andhra Pradesh, has announced that the SSC 2025 supplementary...
By BMA ADMIN 2025-05-19 12:10:11 0 2K
Telangana
గ్రీన్ ఛానల్ ద్వారా HYD కు పెద్ది
గుండెపోటుతో హనుమకొండలో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ mla పెద్ది సుదర్శన్...
By Prashanth Goindla 2026-07-26 07:39:38 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com