Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.

0
198

అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ

 

పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అన్న బొత్స

చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని సూచన

రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా చేయాలనుకుంటున్నారా? అంటూ ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. 

 

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని హితవు పలికారు. గత మూడు రోజులుగా కూటమి ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడుల విషయంలో జనసేన, బీజేపీ నాయకులు ఎందుకు తప్పును తప్పు అని చెప్పడం లేదని బొత్స నిలదీశారు. తనను దుర్భాషలాడటం వల్లే రాంబాబు స్పందించారని తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చి తాను మాట్లాడింది తప్పేనని అంగీకరించారని, అయినా కేంద్ర మంత్రి తడాఖా చూపిస్తామని మాట్లాడటం సరికాదన్నారు. 

 

ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను వైసీపీ తెచ్చిందా? అని బొత్స ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని దేవుడు కూడా క్షమించడని, ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందేనని అన్నారు. అంబటి ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేసి చంపాలనుకుంటున్నారా? అంటూ బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజలే ఆలోచన చేయాలని బొత్స కోరారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఉద్యమం ఉదృతం ఆదర్స్ ఎం సాజి
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా.. విద్యార్థి, యువజన సంఘాల ఉద్యమం ఉధృతం : ఆదర్శ్ ఎం సాజి...
By Rajini Kumari 2025-12-16 07:14:06 0 236
Andhra Pradesh
నార్పాల:ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
నార్పల కస్తూరిబా పాటషాలలో ఖాళీ గా ఉన్న భోధన భోధనేతరా ఉద్యోగ  దారఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు...
By Eslavath RameshNaik 2026-01-12 15:21:26 0 392
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 128
Andhra Pradesh
వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు...
By Gadiyapudi Narendra 2026-03-02 13:39:09 0 325
Andhra Pradesh
పేకాట స్థావరం పై దాడి....నలుగురు అరెస్ట్.
మదనపల్లె మండలంలోని కాట్లాటపల్లి రోడ్డులో పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు...
By Pagadala Venkateswar 2026-05-25 04:33:55 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com