Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి.

0
268

Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి: నారా లోకేష్ ndhra.

Nara Lokesh Urges TDP to Counter YSRCP Propaganda

వైసీపీ చేయకూడని పాపాలు చేసిందన్న లోకేశ్

కూటమిని చీల్చే కుట్ర చేస్తోందని మండిపాటు

కూటమిని చీల్చడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్య

 

వైసీపీ చేయకూడని పాపాలన్నీ చేసిందని మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనని అన్నారు. కూటమిని చీల్చే కుట్ర కూడా చేస్తున్నారని... కూటమి పార్టీలను విడదీయడం ఎవరి వల్ల కాదని చెప్పారు. వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... అందరూ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. టీడీపీ టౌన్, వార్డు, మండల స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని లోకేశ్ సూచించారు. కూటమి పార్టీల నేతల మధ్య సఖ్యత చాలా ముఖ్యమని అన్నారు. తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి, భక్తుల మనోభావాలను గాయపరిచారని విమర్శించారు. 

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం ...!
అంతర్గం మండలం గోలివాడ గ్రామ శివారులో గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం లభమైనట్లు ఎస్సై...
By Sunka Santhosh 2026-06-12 06:17:20 0 136
Andhra Pradesh
పుంగనూరు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి: రైతులు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు, కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు...
By Kothuru Murali 2026-05-15 15:16:23 0 129
Andhra Pradesh
దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరుపై ప్రశంసలు
*దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు*      *మాయమైన బ్రాస్లెట్...
By Rajini Kumari 2026-02-28 12:46:40 0 185
Andhra Pradesh
Chowdepalli: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డీడీఓ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు.
చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా...
By Pagadala Venkateswar 2026-07-31 09:56:05 0 106
Telangana
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
By Sidhu Maroju 2025-10-11 13:01:46 0 291
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com