Chowdepalli: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డీడీఓ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు.

0
103

చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన మండల పరిధిలోని పుదిపట్ల స్వచ్ఛ భారత్ సంకల్పం కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న వర్మీ కంపోస్టు తయారీ విధానం, చెత్త సేకరణ తీరును నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

 

​అనంతరం చౌడేపల్లిలోని చెత్త సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించిన ఆయన, తయారైన వర్మీ కంపోస్ట్ ఎరువును స్థానిక రైతులకు అందుబాటులోకి తెచ్చి అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛరథం షెడ్యూల్‌లో భాగంగా అమినిగుంట పంచాయతీలో పర్యటించి పొడి చెత్త సేకరణ విధానాన్ని, గ్రామంలోని పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.

 

ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు స్వచ్ఛరథం ఆపరేటర్‌తో నేరుగా మాట్లాడారు. స్వచ్ఛరథం సేవలను మరింత సమర్థవంతంగా మరియు మెరుగ్గా ప్రజలకు అందించడానికి చేపట్టాల్సిన పలు ముందస్తు చర్యలను, సూచనలను వివరించారు. ​ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లీలా మాధురి, డిప్యూటీ ఎంపీడీవోలు మస్తాన్, గఫూర్, పంచాయతీ అభివృద్ధి అధికారులు రెడ్డి ప్రకాష్ రెడ్డి, శివ, మహేశ్వర్, అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత
*విజయవాడ   దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత     దుర్గగుడికి...
By Rajini Kumari 2025-12-27 10:39:41 0 295
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు...
By Boya Dasthagiri 2026-06-27 14:52:14 0 208
Telangana
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ : కంటోన్మెంట్  ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం...
By Sidhu Maroju 2025-10-07 11:30:02 0 290
Telangana
పూర్ణచందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు
స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ కు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. పూర్ణ చందర్ ను చంచల్...
By Sidhu Maroju 2025-06-29 14:56:56 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com