మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |

0
233

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా అల్వాల్ పోలీస్ స్టేషన్లో సంబరాలు అంబరాన్నంటాయి.  ఈ సందర్భంగా అల్వాల్ ఎస్హెచ్ఓ (SHO) ప్రశాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఇతర పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులను ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు.

 అనంతరం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో విధి నిర్వహణలో  అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. 

ఈ వేడుకలో భాగంగా పోలీసు సిబ్బంది ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో రహదారి భద్రతపై శక్తి టీం భారీ అవగాహన
చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 10:09:29 0 419
Andhra Pradesh
వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......
చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్...
By Gadiyapudi Narendra 2026-02-20 16:23:27 0 229
Andhra Pradesh
కుమార్తె రాజకీయ అరంగేట్రంపై బొత్స కీలక ప్రకటన
తన కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు....
By Boiena Rajesh 2026-08-19 13:13:15 0 106
Andhra Pradesh
అన్నమయ్య: పదో తరగతి పరీక్షలు: 22, 149 మంది విద్యార్థులు హాజరు.
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 16 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-14 03:14:24 0 193
Andhra Pradesh
మదనపల్లె వార్డుల పునర్వ్యవస్థీకరణపై వైఎస్సార్సీపీ సమావేశం.
మంగళవారం సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో మునిసిపల్ వార్డుల...
By Pagadala Venkateswar 2026-05-20 03:36:04 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com