కేసిఆర్ విచారణకు సర్వం సిద్ధం- నంది నగర్ చేరుకున్న గులాబీ బాస్ .|

0
230

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సిద్ధమయ్యారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న విచారణ కోసం ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ నుండి బయలుదేరి బంజారాహిల్స్ లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.

 

కేసీఆర్ ఎర్రవల్లి నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకునే వరకు దారి పొడుగునా బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసిఆర్ కు సంఘీభావం తెలుపుతూ జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కాన్వాయి వెంట ర్యాలీగా వచ్చారు. కెసిఆర్ పట్ల జరుగుతున్న విచారణను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది.

 

విచారణ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నంది నగర్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.  

 

నంది నగర్ నివాసంలోనికి కేవలం కుటుంబ సభ్యులు, న్యాయానిపుణులను మాత్రమే అనుమతిస్తున్నారు.   

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినందుకు సిట్ అధికారులు కేసిఆర్ ను ప్రశ్నించనున్నారు. అంతకుముందు సిట్ అధికారులు ఎర్రవల్లికి రావాలని కేసీఆర్ కోరగా, సాంకేతిక కారణాల దృష్ట్యా సిట్ దానిని తిరస్కరించి అధికారుల రికార్డుల్లో ఉన్న నంది నగర్ లో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.  

బాధ్యతాయుతమైన పౌరుడిగా తాను విచారణకు సహకరిస్తానని కెసిఆర్ ఇప్పటికే లేఖ ద్వారా తెలిపారు. 

 

ప్రస్తుతం కెసిఆర్ తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, మరియు న్యాయ బృందంతో విచారణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. 

 

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే
మంచిర్యాల : .బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ గారి...
By Avunoori Mahesh 2026-04-14 11:49:45 0 260
Andhra Pradesh
కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు
నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో...
By Patan Khuddus 2026-05-07 02:22:46 0 283
Ladakh
Kargil Airport to Start Commercial Flights Soon
In a significant boost to connectivity and tourism, Kargil Airport is all set to begin commercial...
By Bharat Aawaz 2025-07-17 06:32:47 0 1K
Andhra Pradesh
ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
    ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:57:10 0 114
Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ‎కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం...
By Ponnala Srinivasrao 2026-04-02 16:12:05 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com