నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన

0
558

నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన

 

సారు మా పై దయాచూపండి 

 

   భారత్ అవాజ్ సూర్యమోహన్ కోడంగల్ జనవరి 12:-

 

వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకింపేట్,పోలేపల్లి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం రైతుల నుండి భూసేకరణ చేపట్టారు రైతులకు నష్ట పరిహారం కూడా అందించడం జరిగింది.కానీ హకింపేట్ గ్రామానికి చెందిన సామల బుగ్గప్ప తండ్రి సామల బాలయ్య అనే రైతుకు హకింపేట్ గ్రామంలో సర్వే నెంబర్ 252/8 లో 3.00 ఎకరాల భూమి కలదు ఇట్టి భూమిని రైతు సామల బుగ్గప్ప ప్రభుత్వనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఫైల్ నెంబర్ G/2487/2024,తాండూర్ సబ్ కలెక్టర్ ఫైల్ నెంబర్ B/7450/2024,గెజిట్ నెంబర్ 16-వికారాబాద్ తేది 29.11.2024,నోటిఫికేషన్ ఫారం-సి ప్రకారం క్రమసంఖ్య-214 ప్రకారం అప్పచెప్పినారు.అయినను సామల బుగ్గప్ప అనే రైతుకు నేటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం అందలేదు కావున నిన్న తేది 12.01.2026 నాడు రైతు దుద్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు తమకు న్యాయం చేయాలి అని బ్యానర్ కట్టి వికారాబాద్ జిల్లా కలెక్టర్ తాండూర్ ఆర్డివో దుద్యాల తహసీల్దార్ స్పందించి నష్ట పరిహారం అందేలా న్యాయం చేయాలి అని వినూత్న నిరసన తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా అని వేచి చూడాలి మరి

Search
Categories
Read More
Andhra Pradesh
స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది...
By Pagadala Venkateswar 2026-02-02 07:21:58 0 186
Andhra Pradesh
Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-06 03:54:07 0 166
Andhra Pradesh
ముద్రగడ నివాసానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్...
ఈ రోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ...
By BABJI DADALA 2025-12-23 14:50:53 0 402
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bheeshman King 2026-04-10 11:43:46 0 666
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్...
By Kothuru Murali 2026-05-11 05:48:21 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com