బహిరంగ సభ ముగించుకొని ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

0
289

మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమురంభీమ్ ఆసిఫాబాద్ సభ ముగించుకొని నేరుగా  కొక్కిరాల ప్రేమ్సా గర్ రావు నివాసానికి చేరుకున్నారు,మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రేమ్ సాగర్ రావు ప్రాధాన్యత మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిఫాబాద్ పర్యటన అనంతరం ప్రత్యేకంగా ఎమ్మెల్యే నివాసానికి వెళ్లడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందా అనే దానిపై చర్చ కొనసాగుతోంది,ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధి, పెండింగ్ సమస్యలు, పార్టీ బలోపేతంపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లా ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది,ముఖ్యమంత్రి రాకతో ప్రేమ్ సాగర్ రావు అనుచరుల్లో ఆనందం వెల్లివిరిసింది. “మంచిర్యాల ప్రజల స్వరం రాష్ట్ర స్థాయిలో బలంగా వినిపిస్తోంది” అంటూ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:03:25 0 184
Telangana
వైదిక బ్రాహ్మణ సంఘం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ...
By Sidhu Maroju 2025-12-16 13:20:51 0 291
Andhra Pradesh
ముగతి గ్రామంలో అవగాహన కార్యక్రమం
నందవరం మండలం ముగతి గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-04-25 00:29:52 0 180
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా 27-01-2026 Tue 15:46 | Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-01-28 10:39:12 0 183
Andhra Pradesh
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం :- 20-01-2026   *శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన...
By Rajini Kumari 2026-01-20 10:48:26 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com