జిహెచ్ఎంసి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం - పాల్గొన్న ఎమ్మెల్యే.|

0
30

మేడ్చల్ మల్కాజ్గిరి :  జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొని, మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

మల్కాజ్‌గిరి పరిధిలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, వినాయక్‌నగర్ డివిజన్‌లోని జె.కె. కాలనీలో బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ (IAS) ఆర్.వి. కర్ణన్ కు వినతి పత్రాన్ని వ్యక్తిగతంగా అందజేశారు.

అదేవిధంగా, జీహెచ్ఎంసీ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల భూములను అమ్మకానికి పెట్టిన HILTP పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు

రూ. 5 లక్షల కోట్ల విలువ కలిగిన 9,292 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మేస్తూ దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ స్కామ్‌కు తెరలేపిన రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వ విధానాలను ఎమ్మెల్యే లు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆస్తులను మాఫియాలకు కొట్టేస్తున్న ఈ అన్యాయాన్ని తాము ఏ విధంగానైనా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల తో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు..

   Sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన
         మెదక్ జిల్లా:  మెదక్  నియోజకవర్గ ప్రజల సమస్యలను...
By Sidhu Maroju 2025-08-24 14:49:40 0 371
Telangana
రేపు బీసీ బంద్ : తెలంగాణ డిజిపి కీలక సూచనలు
హైదరాబాద్ : బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ బంద్ ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర...
By Sidhu Maroju 2025-10-17 14:08:29 0 126
Andhra Pradesh
ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి
మునగల పాడు కర్నూల్ మండలం ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి...
By mahaboob basha 2025-10-17 11:04:45 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com